Today 8 August 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన లాభం జరగనుంది. ఉద్యోగులు చేసే ప్రయత్నాలు విజయవంతంగా పూర్తి అవుతాయి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాసిన ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : అనుకున్న పనులు పూర్తి అవుతాయి. కానీ కొంచెం కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారులు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు ఉండనున్నాయి. వ్యాపారులు ఆశించిన దాని కంటే ఎక్కువగా లాభాలు పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి కావడంతో ఈరోజు సంతృప్తిగా ఉంటారు. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : వ్యాపారులకు ఈరోజు అనుకోని అదృష్టం కలగనుంది. వీరికి లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు ఉండనున్నాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు రావడంతో పాటు అదనపు ఆదాయం సమకూరనుంది. సోదరులతో ఉన్న ఆస్తి వివాదాలు సమసి పోయే అవకాశం ఉంటుంది. కొన్ని పనులు కష్టంగా ఉన్నా వెంటనే పూర్తవుతాయి. విద్యార్థులు శుభవార్తలు వింటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఈ రోజు ఎటువంటి పనిని ప్రారంభించిన విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. తోబుట్టుల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి. అయితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఉద్యోగులు అధికారుల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . . ఈ రాశి వారి ఉద్యోగులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కోగలుగుతారు. అనుకోకుండా ధనలాభం ఉండడంతో వ్యాపారులు ఉల్లాసంగా ఉంటారు. కొన్ని పనులు చేపడితే వెంటనే పూర్తి అవుతాయి. ఇతరుల నుంచి రావాల్సిన డబ్బు అందుతుంది. వేరే వాళ్లకు ఆర్థిక వ్యవహారాల గురించి చెప్పకుండా ఉండాలి. ఉద్యోగులు కొత్త ఆదాయం కోసం ప్రయత్నాలు చేస్తారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారికి ఈ రోజు సంతోషంగా గడుస్తుంది. వీరికి వరలక్ష్మీ వ్రతం కలిసి రానుంది. వ్యాపారులకు ఊహించని ధన లాభం ఉంటుంది. ఉద్యోగులు అదనపు బాధ్యతలు చేపట్టడంతో బిజీగా మారుతారు. కుటుంబ సభ్యుల మధ్య గౌరవ మర్యాదలు పెరిగిపోతాయి గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు కొన్ని కంపెనీలనుంచి శుభవార్తలు అందుతాయి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . రుణభారం నుంచి విముక్తి పొందుతారు. కొత్త అప్పులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు పరిపాలన పెరుగుతుంది. అయితే ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆచితూచి ఖర్చులు చేయాలి. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. కొన్ని వస్తువుల విషయంలో మౌనంగా ఉండటమే మంచిది. ఈ సమయంలో జీవిత భాగస్వామితో వాగ్వాదం ఏర్పడే అవకాశం ఉంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు ఎటువంటి ప్రయత్నాలు చేసిన సక్సెస్ అవుతుంది. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి చేసే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఆదాయం రాబడి కోసం ఉద్యోగులు తీవ్ర ప్రయత్నాలు చేస్తారు. వీరికి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. సోదరులతో కలిసి కుటుంబ సభ్యుల సమస్యను పరిష్కరిస్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) :. ఈ రాశి వారు అనుకోకుండా ధన లాభాన్ని పొందుతారు. దీంతో వ్యాపారాలు ఉత్సాహంగా పనిచేస్తారు. వ్యక్తిగత సమస్యలు వెంటాడుతాయి. వాటిని పరిష్కరించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం అందుతుంది. కానీ అధికారుల నుంచి ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . వృత్తి వ్యాపారాల్లో రాబడి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులు అనుకున్న ప్రయత్నాలు పూర్తి చేస్తారు. ఆస్తి తగాదాలు ఉంటే వెంటనే పరిష్కారం అవుతాయి. కుటుంబ సమేతంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . ఈ రాశి వారి పిల్లల కెరీర్ పై ఈరోజు దృష్టి పెడతారు. వారు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. అర్హులైన వారికి వివాహ ప్రయత్నాలు జరుగుతాయి. ఆధ్యాత్మికా క్షేత్రాలను సందర్శిస్తారు. ధన లాభం ఉండే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి డబ్బు ఇస్తానని మాట ఇవ్వకూడదు. అవసరాలకు తగిన ఆదాయం వస్తుంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . విశ్రాంతి లేకుండా ఈరోజు ఉద్యోగులు బిజీగా మారుతారు. ఇదే సమయంలో ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండాలి. అనుకోకుండా వ్యాపారులకు ధన లాభం పెరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో గొడవలు ఉండే అవకాశం. అయితే వారితో షాపింగ్ చేయడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. ఆస్తి చిక్కుల నుంచి బయటపడతారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఇతరుల నుంచి డబ్బు అందుతుంది. బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి వెళ్తారు. వ్యాపారులు బిజీగా మారిపోతారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం అందుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక క్షేత్రాలలో సందర్శిస్తారు. దూర ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.