Homeఆధ్యాత్మికంToday 5 February 2026 Horoscope: ఈ రాశి వ్యాపారులకు ఈరోజు ఊహించని లాభాలు..

Today 5 February 2026 Horoscope: ఈ రాశి వ్యాపారులకు ఈరోజు ఊహించని లాభాలు..

Today 5 February 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై ఉత్తర పాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో వ్యాపారులకు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు అదనపు ఆదాయం చేకూరుతుంది. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : . ఈ రాశి వారు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. వ్యాపారులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో ఈరోజు అధిక లాభాలు పొందుతారు. భాగస్వామి సహాయంతో కొత్తపెట్టబడులు పెడతారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు పోటు పరీక్షల పాల్గొంటే విజయం సాధిస్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. అయితే గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి స్వల్ప లాభాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అధిక ఖర్చులను నియంత్రించుకోవాలి.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి ఉద్యోగులు కార్యాలయాల్లో అధిక ప్రయోజనాలు పొందుతారు. వీరు చేసే కొన్ని పనులకు అధికారుల మద్దతు ఉంటుంది. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. ప్రియమైన వారి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. సోదరుల మధ్య విభేదాలు రావచ్చు. పూర్వీకుల ఆస్తిపై కీలక నిర్ణయం తీసుకుంటారు. కొత్తగా పెట్టుబడులు పెడతారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే గురువుల మద్దతు ఉంటుంది. ఉద్యోగులకు అదనపు ఆదాయం చేపడుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారి ప్రియమైన జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు గతంలో కంటే ఇప్పుడు మెరుగైన లాభాలు పొందనున్నారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ఇక నిర్ణయాలు తీసుకుంటారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురైనా కూడా వాటి నుంచి బయటపడతారు. ఉద్యోగులకు తోటి వారి సపోర్ట్ ఉంటుంది. దీంతో ప్రాజెక్టులను వెంటనే గుర్తు చేస్తారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. దీంతో అధిక లాభాలు పొందుతారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈరోజు అన్ని రంగాల్లో రాణించే అవకాశం ఉంది. గతంలో కంటే ఇప్పుడు వ్యాపారులు లాభాలు పొందుతారు. అదనపు ఆదాయం చేకూరే అవకాశం ఉంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అనవసరమైన వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. సమాజంలో గౌరవం పెరగడంతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేసుకోగలుగుతారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. కొత్తగా ఏ పని మొదలుపెట్టినా దాన్ని వెంటనే గుర్తు చేస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులకు సీనియర్ల నుంచి మద్దతు ఉంటుంది. వీరు చేసే ప్రతి పనిలో విజయ ఉంటుంది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకున్న పనులు అన్ని పూర్తి అవుతాయి. స్నేహితులతో సరదాగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు మెరుగైన లాభాలు ఉంటాయి. ప్రభుత్వం నుంచి మద్దతు ఉండడంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు చాలా సంతోషంగా ఉంటుంది. తెలివితేటలతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు. కొన్ని ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. గతంలో కంటే ఇప్పుడు వ్యాపారులు లాభాలు పొందుతారు. అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular