Today 28 August 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై స్వాతి నక్షత్ర ప్రభావం ఉండనుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మరికొన్ని రాశుల వ్యాపారులు కొత్తవారితో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఇంట్లోకి అతిథి రావడంతో సందడిగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే భాగస్వాములతో చర్చించాలి. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసేవారు ఈరోజు లాభాలు పొందుతారు. బంధువుల నుంచి దన సహాయం అందుతుంది. ఉద్యోగులు ఆశించిన ఫలితాలు పొందుతారు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు లక్ష్యాన్ని పూర్తి చేయడానికి తీవ్రంగా కష్టపడతారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోవాలి. కొత్తవారికి డబ్బు ఇవ్వకుండా ఉండాలి. గతంలో కొందరికి ఇచ్చిన డబ్బు ఈరోజు తిరిగి వస్తుంది.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులు కొత్తగా ఏదైనా పనిని ప్రారంభించాలనే అనుకుంటే పెద్దల సలహా తీసుకోవడం మంచిది. ఉద్యోగులు ప్రణాళిక బద్ధంగా తమ లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఇంట్లో గొడవలు ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనాలని అనుకుంటే ఇదే మంచి సమయం. దూర ప్రయాణాలు చేయకుండా ఉండడమే మంచిది. నిరుద్యోగులు వచ్చిన అవకాశాలను వినియోగించుకోవాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు కార్యాలయాల్లో అనుకూలమైన వాతావరణ ఉంటుంది. లక్ష్యాలను పూర్తి చేయడానికి ఉద్యోగులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వ్యాపారులకు తోటి వారి సహాయం ఉంటుంది. దీంతో లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెంపొందిస్తాయి. ఉన్నత విద్య చదవాలని అనుకునే వారికి అవకాశాలు వస్తుంటాయి. విదేశాల నుంచి శుభవార్తలు వింటారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు కొన్ని పనులు చేయడం వల్ల సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు. కొందరు డబ్బు ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. అవసరం ఉంటే మాత్రమే తీసుకోవాలి. ప్రియమైన వారితో ఈరోజు సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య కొన్ని విషయాలపై గొడవలు ఉండే అవకాశం ఉంది. అయితే అనవసరమైన వివాదాలకు తలదూర్చకుండా ఉండడమే మంచిది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. విహార యాత్రలకు వెళ్లాలని ప్లాన్ చేస్తే సక్సెస్ అవుతుంది. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి. కొత్త వ్యక్తులతో వ్యాపారం చేయకపోవడమే మంచిది. పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఈరోజు ఎవరితో వాదనలు పెట్టుకోకుండా ఉండడమే మంచిది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు ఉత్సాహంగా పని చేయగలుగుతారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పెండింగ్ పనులలో పూర్తి చేస్తారు. ఒకరి సహాయంతో కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. కొత్త వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు. కుటుంబ సభ్యుల మద్దతు ఉండటంతో లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం చేయకూడడానికి అవకాశాలు ఉంటాయి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు నిరాశలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల మద్దతుతో కొన్ని పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులు అధికారుల మద్దతుతో లక్ష్యాలను పూర్తి చేస్తారు. గతంలో ఉన్న ఒత్తిడి నుంచి బయటపడతారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఎవరికి డబ్బు ఇవ్వకుండా ఉండాలి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు కష్టపడిన దానికి సరైన ఫలితం పొందుతారు. కార్యాలయాల్లో కొందరు ఉద్యోగులు మోసం చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల కొత్త వారితో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. కొందరు వ్యాపారులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. దీంతో వ్యాపారులు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. చట్టపరమైన చిక్కులు ఉంటే వాటి నుంచి బయటపడతారు. స్నేహితుల తో సరదాగా ఉంటారు. పూర్వీకుల ఆస్తి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి శుభవార్తలు అందుతాయి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు ఎవరితో గొడవ పెట్టుకోకుండా ఉండాలి. ఉద్యోగం కోసం చూస్తున్న వారు శుభవార్త వింటారు. అదనపు ఆదాయం పొందాలని ఉద్యోగులకు ఇదే మంచి అవకాశం. వ్యాపారులకు మెరుగైన లాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు ఉండటంతో వ్యాపారులు మెరుగైన లాభాలు సాధిస్తారు. కాస్త నైపుణ్యంతో ఉద్యోగులు లక్ష్యాలను చేరుకుంటారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. కొందరికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది.