spot_img
Homeఆధ్యాత్మికంToday 27 April 2026 Horoscope: ఐదు రాశుల వారికి ఈరోజు అపారమైన సంపద..

Today 27 April 2026 Horoscope: ఐదు రాశుల వారికి ఈరోజు అపారమైన సంపద..

Today 27 April 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై పూర్వ పాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. మరికొన్ని రాశుల వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు అన్ని పరిస్థితులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వ్యాపారులు మాత్రం కొన్ని పనుల్లో జాగ్రత్తగా వహించాలి. కొత్త పెట్టుబడులు ప్రారంభించే ముందు పెద్దలను సంప్రదించడం మంచిది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగులకు పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకోకుండా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతి విషయంలో అధికారులతో చర్చిస్తారు. వ్యాపారులకు కొత్త భాగస్వాములు పరిచయమవుతారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు వస్తాయి.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో మెరుగైన లాభాలు ఉంటాయి. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఖర్చులు పెరగడంతో ఆందోళన వాతావరణం ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రతికూల వాతావరణం ఏర్పడడంతో ఇంట్లో సమస్యలు ఎదురవుతాయి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం లభిస్తుంది. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఆదాయం గరనీయంగా పెరుగుతుంది. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు జాగ్రత్తగా ఉండాలి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ లాభాలు ఉంటాయి. ఉద్యోగులు పదోన్నతి విషయంలో శుభవార్తలు వింటారు. నిరుద్యోగులు కొత్త ఉద్యోగాన్ని పొందేందుకు మార్గం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొందరితో అనవసరంగా వాదనలకు దిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండడమే మంచిది. వ్యాపారులు లాభాల కోసం తీవ్రంగా కృషి చేస్తారు. కొందరి కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించాలంటే తోటి వారి సహాయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారుల పనులకు ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది. అయితే మానసికంగా ఆందోళనలతో ఉంటారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం వస్తుంది. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. అనుకోకుండా ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో అప్రమత్తంగా ఉండాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈరోజు అకస్మాత్తుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరిగా అయ్యే అవకాశం ఉంది స్నేహితుల సహాయంతో పనులన్నీ పూర్తి చేస్తారు. వ్యాపారులు కొత్తగా లాభాలను పొందుతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. వ్యాపారులకు అకస్మాత్తుగా పెద్ద ఎత్తున డబ్బు వసూలు అవుతుంది. ఉద్యోగులు కొత్త ఆదాయాన్ని పొందుతారు. గతంలో ఉన్న కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం లభిస్తుంది పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో అదనపు ఆదాయం పొందుతారు. కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు అనుకోకుండా లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో కొత్త ప్రాజెక్టులను చేపడతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు అనుకున్న పనులు అన్ని పూర్తి చేస్తారు. వ్యాపారులకు అధిక లాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version