Today 26 November 2025 Horoscope: గ్రహాల మార్పుతో కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. బుధవారం ద్వాదశ రాశులపై శ్రావణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అదృష్టం వెంటపడనుంది. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈరోజు అనకొండపల్లిలో పూర్తి చేయగలుగుతారు. ఇంట్లో లేదా బయట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు, వ్యాపారలతో సహా అందరూ లాభాలు పొందుతారు. కొన్ని విషయాల్లో శ్రమ పడకుండానే ఆదాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వినోదం కోసం డబ్బులు ఖర్చు చేస్తారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మత విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. మనసులో ఉన్న భయాన్ని తొలగించి అనుకున్న పనులను పూర్తిచేయాలి. దూరపు బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఈరోజు ప్రతి బరువు ప్రదర్శించడం వల్ల అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. స్నేహితుల విషయంలో డబ్బు వ్యవహారాలు జరుపకూడదు. కొందరు పక్కనే ఉండి మోసం చేసే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారులు ఈరోజు అదనపు ఆదాయాన్ని పొందుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని ప్రతికూల వాతావరణాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థుల కోటి పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులకు ఊహించిన దానికంటే తక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కొత్త ప్రణాళికల ద్వారా ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి సమయంలో తోటి వారి సహాయం తీసుకోవాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారి కుటుంబ సభ్యుల్లో కొన్ని విభేదాలు ఏర్పడతాయి. అయితే ఇలాంటి సమయంలో మౌనంగా ఉండటమే మంచిది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం వస్తుంది. ఎవరితోనైనా వాదనలకు దిగకుండా ఉండాలి. పూర్వీకుల ఆస్తి విషయంలో శుభవార్తలు వింటారు. ఖర్చులకు సరిపడా డబ్బు వస్తుంది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఉద్యోగులు అనుకున్న పనులను పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక సమస్యలు తొలగిపోయి సంతృప్తిగా ఉంటారు. స్నేహితుల సహాయంతో ధన సమస్యలు తీరుతాయి. విద్యార్థులు గురువుల మద్దతుతో పోటీ పరీక్షలో పాల్గొంటారు. అయితే పై చదువుల కోసం దూరపు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు లాభాలను పొందే అవకాశం ఉంది. అయితే ఇదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొందరు పనులకు అడ్డంకి సృష్టించే అవకాశం ఉంటుంది. అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా గతంలో కంటే ఇప్పుడు మెరుగైన లాభాలు సాధిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఎప్పుడు లాభాలు పొందుతారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గతంలో ఉన్న వైఫల్యాలనుంచి బయటపడి వ్యాపారులు లాభాలను పొందుతారు. ఉద్యోగులకు తోటి వారి సహాయం ఉంటుంది. దీంతో పెండింగ్ పనులను పూర్తి చేయగలుగుతారు. ఇతరులకు డబ్బు ఇచ్చే విషయంలో ఆలోచించాలి. ఎందుకంటే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందర పడొద్దు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈ రాశి వారు ఈరోజు శుభ ఫలితాలను వింటారు. వివాదాలు తొలగిపోవడంతో సంతృప్తిగా ఉంటారు. మహిళలు కొత్తగా వ్యాపారం చేసే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో పెద్దల సలహా తీసుకోవాలి. బంధువుల నుంచి రుణం అందుతుంది. ఏదైనా విషయంలో స్పందించే ముందు బాగా ఆలోచించాలి. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఇతరులతో వాదనలకు దిగకుండా ఉండడమే మంచిది. పెద్దలను గౌరవించాలి. వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. విద్యార్థులు పై చదువుల కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. అయితే ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని పనుల కారణంగా బిజీగా ఉంటారు. అయినా కూడా ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మద్దతు ఉండటంతో వ్యాపారులు లాభాలు పొందుతారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థులు పోటీపరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు అదృష్టం వెంట పడనుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్యాల నుంచి బయటపడతారు. కొన్ని రహస్యాలను ఇతరులకు చెప్పకుండా ఉండడమే మంచిది. ఆర్థిక ప్రయోజనాలు అధికంగా పొందుతారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరులకు డబ్బు ఇచ్చే విషయంలో ఆలోచించాలి.