Home ఆధ్యాత్మికం Today 26 June 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం.....

Today 26 June 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం.. డబ్బు కట్టలు లెక్క పెట్టాల్సిందే..

7
Today 26 June 2026 Horoscope
Today 26 June 2026 Horoscope

Today 26 June 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై జ్యేష్ట నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అనుకున్న దానికంటే ఎక్కువగా లాభాలు ఉంటాయి. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండనున్నాయి. దీంతో ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. గతంలో మొదలు పెట్టిన పనులను ఈరోజు విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులకు గురువుల మద్దతు ఉంటుంది. దీంతో పోటీ పరీక్షల్లో రాణిస్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కొన్ని ముఖ్యమైన పనులను వెంటనే పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని కష్టమైన పనుల విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. దుబారా ఖర్చుల విషయంలో అదుపు ఉండాలి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి ఈ రోజు ఆదాయం రెట్టింపుగా మారే అవకాశం ఉంది. అయితే వ్యాపారులు కొన్ని నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వీరు కొత్త వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పెట్టుబడును పెట్టేముందు ఆలోచించాలి. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని విజయాలే సమకూరుతాయి. గతంలో మొదలుపెట్టిన పనులను ఈరోజు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో అధికారుల మద్దతు ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. అనుకోకుండా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారి వైవాహిక జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామికి కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు సమాజంలో గౌరవాన్ని పొందుతారు. రాజకీయాల్లో ఉండే వారికి ప్రజల నుంచి మద్దతు ఉంటుంది. వ్యాపార కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువుల మధ్య సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితికి తగిన విధంగా ఖర్చులు చేయాలి. దుబారా ఖర్చులను నియంత్రించాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు సక్సెస్ రోజు అని చెప్పుకోవచ్చు. వ్యాపారులు తమ తెలివితేటలతో అధిక లాభాన్ని పొందుతారు. ప్రయాణాల్లో కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఏ రోజు అపారమైన విజయాలు వచ్చే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఉండే వారికి ప్రజల నుంచి మద్దతు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. పిల్లల కెరీర్ విషయంపై కీలక నిర్ణయం తీసుకుంటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదించడం మంచిది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. కొన్ని విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వీరికి లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండడంతో ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. గతంలో ఏర్పాటు చేసిన లక్ష్యాలను ఈరోజు పూర్తి చేస్తారు. ఉద్యోగులు కార్యాలయాల్లో రాణిస్తారు. గతంలో కంటే ఇప్పుడు వ్యాపారులు లాభాలు పొందుతారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండడమే మంచిది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని పనుల్లో విజయమే ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. గతంలో అనుకున్న ముఖ్యమైన పనులను ఈరోజు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం ఏర్పడుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు శుభవార్తలు అందే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు ఉంటాయి. కొత్త వ్యక్తులు పరిచయమైన సందర్భంగా వారితో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాల్లో ఉండేవారికి ప్రజల నుంచి మద్దతు ఉంటుంది.