Homeఆధ్యాత్మికంToday 20 April 2026 Horoscope: ఈ రాశుల వ్యాపారులకు ఈరోజు అనుకోకుండా అపారమైన లాభాలు..

Today 20 April 2026 Horoscope: ఈ రాశుల వ్యాపారులకు ఈరోజు అనుకోకుండా అపారమైన లాభాలు..

Today 20 April 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై కృతిక నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకోకుండానే ధన లాభం ఉంటుంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈ రోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులకు అధికారులు పదోన్నతులు ఇచ్చే సమయం ఈరోజే. నిరుద్యోగులు కొత్త అవకాశాలను పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులకు అనేక రంగాల్లో కలిసి వస్తుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో ఊహించని లాభాలు పొందుతారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. అయితే కొన్ని పనులు నెమ్మదిగా సాగడం వల్ల కాస్త అసంతృప్తితో ఉంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. కొత్త వస్త్రాలను కొనుగోలు చేస్తారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి ఈరోజు చాలా శుభప్రదం. కొత్తగా ఏదైనా పనులు ప్రారంభించాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి వ్యాపారులకు ఈరోజు అధికంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు అదనపు ప్రాజెక్టులను ప్రారంభించడానికి కూడా సరైన సమయం ఇదే. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి సంతోషంగా గడుపుతారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : కర్కాట రాశి వారికి బంధువుల నుంచి శుభవార్తను అందుతాయి. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న ముఖ్యమైన పనులు ఈరోజు పూర్తి అవుతాయి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. అయితే వారితో అప్పుడే ఆర్థిక వ్యవహారాలు జరపకుండా ఉండాలి. పెట్టుబడుల నుంచి సరైన ఫలితాలు రావడంతో సంతృప్తిగా ఉంటారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారికి ఈ రోజు ఊహించని డబ్బు అందుతుంది. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. ఉద్యోగులు అధికారుల నుంచి కొంత ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కానీ తోటి వారి సహాయంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఇదే సమయంలో ఒప్పందాలు చేసుకునేటప్పుడు జాగ్రత్తలు వహించాలి. పెద్దల అండదండలతో కొన్ని పనులను పూర్తి చేస్తారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి విద్యార్థుల కెరీర్ పై ఈరోజు కీలక నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులకు సానుకూలమైన ఫలితాలు ఉండడంతో పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. దీంతో కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారులు గతంలో మొదలు పెట్టిన పనులను ఈరోజు పూర్తి చేస్తారు విద్యార్థులకు గురువుల మద్దతు ఉంటుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలనుకుంటే ఈరోజు సాధ్యమవుతుంది. వ్యక్తిగతంగా స్థిరంగా ఆదాయాన్ని పొందుతారు. కొన్ని కష్టమైన పనులను ఈరోజు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో గౌరవం లభిస్తుంది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : . ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈ రోజు మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది. వ్యాపారము ఎలాంటి రిస్కు తీసుకోకుండా ఉండాలి. ఉద్యోగులకు కార్యాలయాల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. రాజకీయ నాయకులకు కాస్త ప్రతికూలమైన వాతావరణ ఉండే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈ రాశి వారికి ఈ రోజు గతంలో కంటే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పెట్టుబడులు పెడతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. విద్యార్థుల పోటీ పరీక్షలకు గురువుల మద్దతు ఉంటుంది.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలపై సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు క్లిష్టమైన పరిస్థితుల్లో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు స్నేహితులతో విహారయాత్రలకు వెళ్తారు. ఖర్చులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు వహించాలి. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారానికి సంబంధించిన సరైన ప్రణాళిక వేస్తారు. ఆర్థికంగా అనుకున్న ఫలితాలు సాధిస్తారు. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండడమే మంచిది.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు పెండింగ్ పనులను పూర్తి చేసే అవకాశం ఉంది. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం ఎరుగుపడుతుంది. కొత్త అవకాశాలను పొందుతారు. విద్యార్థులకు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం అందుతుంది. గ్రహాల అనుకూలతో వీరికి అదనపు ఆదాయం అందుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular