Today 2 August 2025 Horoscope: గ్రహాల మార్పుతో నక్షత్రాల స్థితి మారుతుంది. ఈ నేపథ్యంలో శనివారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వ్యాపారులు అరుదైన లాభాలు పొందగలుగుతారు. మరికొన్ని రాశుల ఉద్యోగులకు కష్టాలు తప్పవు. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈరోజు కష్టపడి పని చేయాల్సి వస్తుంది. అయితే దానికి తగిన ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. వీరితో అప్పుడే ఆర్థిక వ్యవహారాలు జరపొద్దు. ఉద్యోగులకు విలువైన సమాచారం అందుతుంది. అధికారుల నుంచి ఉండే వేధింపులు తగ్గిపోతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు మానసికంగా ఆందోళన ఉంటుంది. ఉద్యోగులు తమ విధులపై ప్రత్యేక దృష్టి పెడతారు. ఆర్థికంగా ఎక్కువగా ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పెట్టుబడును పెడతారు. వీటివల్ల అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా పనిని ప్రారంభించేముందు పెద్దల సలహా తీసుకోవడం అవసరం.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి వేధింపులను ఎదుర్కొంటారు. స్నేహితులతో సరదాగా ఉంటారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే.. జాగ్రత్తగా ఉండాలి. ఇంటికి బంధువుల రాకతో సందడిగా ఉంటుంది. అనుకోకుండా కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఉద్యోగులు తమ విధులను విజయవంతంగా పూర్తి చేస్తారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి వారు ఈరోజు చాలా బిజీగా గడుపుతారు. అనుకోకుండా వ్యాపారులు కొత్త పనిని ప్రారంభిస్తారు. వీరికి జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది. నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో గుర్తింపు లభిస్తుంది. ఇంట్లోకి సంబంధించిన విషయాలను ఇతరులకు చెప్పొద్దు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . కొన్ని పాత పనులను ఈరోజు పూర్తి చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి. వ్యాపారులు అధిక ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు పాలిస్తాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పెండింగ్ పనులపై నిర్లక్ష్యంగా ఉండకూడదు. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈరోజు వ్యాపారులు ముఖ్యమైన వారితో సమావేశం ఏర్పాటు చేస్తారు. అదనపు పెట్టుబడుల గురించి చర్చిస్తారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇదే మంచి సమయం. ఉద్యోగులకు అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఒక ప్రాజెక్టు కోసం వెళితే అది సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. విద్యార్థులు గురువుల సలహాతో కొన్ని పరీక్షల్లో పాల్గొంటారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : తుల రాశి వారు ఈరోజు కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఇదే సమయంలో ఆర్థిక వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బంధువుల నుంచి డబ్బు సహాయం అందుతుంది. కుటుంబ సభ్యుల కోరిక మేరకు కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) :. . ఉద్యోగులకు ఈరోజు అనుకూలమైన వాతావరణ ఉంటుంది. వీరు ఏ పని చేపట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారులు తమ తెలివితేటలను ప్రదర్శించి లాభాలను పొందుతారు. ఆరోగ్య విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. వృధా ఖర్చులకు దూరంగా ఉండాలి. విద్యార్థులను ప్రోత్సహించేందుకు కొందరు ముందుకు వస్తారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈ రాశి నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగానికి సంబంధించి శుభవార్త వింటారు. ఇంట్లో శుభకార్యం జరగడానికి అవసరమైన చర్చలు చేస్తారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఏవైనా గొడవలు ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . ఈ రాశి వారు చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు. కొన్ని పనులు పూర్తి చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. ఆలోచన విధానం మారడంతో ఇతరుల సహాయం తీసుకోవాల్సి వస్తుంది. అయితే తోటి వారి సపోర్టు ఉంటుంది. వ్యాపారులు కొత్త భాగస్వాములతో చర్చిస్తారు. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసేవారు లాభాలు పొందుతారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . కుంభరాశి వారు ఈరోజు తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించాల్సి ఉంటుంది. దీంతో ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారులకు అరుదైన అవకాశం లభిస్తుంది. కొత్తగా వస్తువులు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తారు. డబ్బు విషయంలో పురోగతి సాధిస్తారు. అనుకోకుండా ధనలాభం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండగలుగుతారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈరోజు కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు తమ తెలివితో పోటీ పరీక్షల్లో నెగ్గ గలుగుతారు. వ్యాపారులు కొన్ని పనులు పూర్తి చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. దూర ప్రయాణాలు చేసే వారు సొంత వాహనాలను ఉపయోగించుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సమస్యలు తొలగిపోతాయి.