Ganesha not immersed: వినాయక చవితి ఉత్సవాలను పది రోజుల పాటు నిర్వహిస్తారు. నవరాత్రులు ప్రత్యేక పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుతాడు. అయితే వినాయక నిమజ్జనం అన్ని ప్రాంతాల్లో ఒకే రోజు ఉండకపోవచ్చు. కానీ నిమజ్జనం మాత్రం కచ్చితంగా ఉంటుంది. అంటే వినాయక చవితి రోజు ప్రతిష్టించబడిన విగ్రహం ఆ తరువాత నిమజ్జనం చేయాల్సిందే. కానీ ఇక్కడ మాత్రం వినాయకుడిని నిమజ్జనం చేయరు. కేవలం నీళ్లు చల్లి భద్రపరుస్తారు. తిరిగి మరోసారి వినాయక చవితి రోజు ప్రతిష్టిస్తారు. అంతేకాదు.. ఇక్కడి వినాయకుడి విగ్రహాన్ని దర్శించుకుంనే సకల రోగాలు తొలగిపోతాయట. ఇంతకీ ఎక్కడి వినాయకుడు నిమజ్జనం కాకుండా ఉంటాడు? అసలేంటీ స్టోరీ?
వినాయక చవితి ఉత్సవాలను దేశ, విదేశాల్లో జరుపుకుంటారు. కానీ ఆయా ప్రాంతాలకు అనుగుణంగా వేడుకలు నిర్వహిస్తారు. అలాగే ఉత్తర తెలంగాణలోని నిర్మల్ జిల్లా కుభీర్ మండలం సిర్పెల్లి గ్రామానికి దగ్గర్లో పాలాజ్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామం మహారాష్ట్ర సరిహద్దులో ఉంటుంది. ఇక్కడికి తెలంగాణ, ఏపీ నుంచి భక్తులు వచ్చి వినాయకుడిని దర్శించుకుంటున్నారు. ఈ వినాయకుడిని సత్య గణేశడిగా పిలుస్తారు. 71 సంవత్సరాలుగా ఇక్కడి వినాయకుడిని నిమజ్జనం చేయకుండా ఉంటున్నారు.
పూర్వ కాలంలో ఈ గ్రామంలో వ్యాధులు వచ్చి బాధపడ్డారు. ఇదే సమయంలో వినాయక చవితి రావడంతో గ్రామంలోని ఒక వ్యక్తికి కలలో వినాయకుడు వచ్చి నన్ను కర్రతో చేసి ప్రతిష్టిస్తే మీ కష్టాలు దూరమవుతాయి.. అని చెప్పాడని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఆ వ్యక్తి చెప్పిన ప్రకారం ఊరి వాళ్లంతా కలిసి కర్రతో కలిసి వినాయకుడిని తయారు చేసి ప్రతిష్టించారు. ఆ తరువాత 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో ఆ గ్రామంలోని ప్రజలు రోగాలకు దూరమయ్యారు. దీంతో తమకు ఈ దేడువు కరుణించాడని భావించారు.
అయితే ఈ వినాయకుడిని నిమజ్జనం చేయకుండా ఏడాదంతా భద్రపరుస్తారు. ప్రతీ ఏడాది చవితి రోజున బయటకు తీసి ప్రతిష్టిస్తారు. 11 రోజులు పూర్తయిన తరవాత కేవలం నీళ్లు చల్లుతారు. అయితే మిగతా ప్రాంతాల్లో మాదిరిగానే ఇక్కడ గ్రామస్థులు 11 రోజుల పాటు నిష్టగా ఉంటారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఇక్కడి వినాయకుడిని చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. అయితే ఈ వినాయకుడి వద్దకు చేరకోవాలంటే నిర్మల్ జిల్లాలోని భైంసాకు చేరుకోవాలి. ఇక్కడి నుంచి నేరుగా పాలాజ్ కు బస్సులు ఉండటాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి వెళ్లాలని అనుకునేవారు కుభీర్ గుండా మాలెగాం మీదుగా పల్సి గ్రామం వెళ్లాలి. ఆ తరువాత పాలాజ్ గ్రామం వస్తంది.