Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవంబర్ 17న శుక్రవారం నాగుల చవితి సందర్భంగా ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో మేషం, కర్కాటకం, ధనుస్సు రాశులవారికి విశేష ఫలితాలు ఉంటాయి. మిగతా 12 రాశుల వివరాలు ఎలా ఉన్నాయంటే?
మేషరాశి:
ఈ రాశివారికి కుటుంబ సభ్యల్లో విభేదాలు రావొచ్చు. కోపాన్నినియంత్రించుకోవాలి. పెండింగులో ఉన్న పనులు పూర్తి చేయాలి. కొన్ని రంగాల వారు చేపట్టిన పనులు వెంటనే పూర్తవుతాయి.
వృషభం:
రాజకీయనాయకులకు కొత్త దారులు ఉంటాయి. స్నేహితులతో సరదాగా గడుపుతారు. బంధువుల నుంచి సంతోషకర వార్తలు వింటారు. ప్రభుత్వ పనులు పూర్తవుతాయి.
మిథునం:
ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చేసే పనిపై దృష్టి పెట్టాలి. ఇష్టమైన వాటిని దొంగిలించే అవకాశం. వీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
కర్కాటకం:
ఈరాశి వారిపై నాగుల చవితి ప్రభావం ఉంటుంది. వీరు ఉల్లాంగా గడుపుతారు. సమాజంలో కీర్తి, ప్రతిష్టతలు పెరుగుతాయి. పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తారు.
సింహం:
మీరు చేసే పనుల్లో ప్రత్యర్థులు అడ్డుపడుతూ ఉంటారు. పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి విజయావకాశాలు. ఈ రాశివారు ఈరోజు శక్తివంతంగా ఉంటారు.
కన్య:
ఉద్యోగులు కార్యాలయాల్లో విశేష ఫలితాలు పొందుతారు. వ్యాపారులు స్వల్ప లాభాలు పొందుతారు. కోర్టు కేసుల్లో అనుకూల తీర్పు వస్తుంది.
తుల:
కుటుంబ సమస్యలను పరిస్కరించుకుంటారు. వ్యాపారులు పెట్టుబడి పెట్టే ముందు ఆలోచించాలి. మనసు ఉల్లాసంగా ఉంటుంది. భవిష్యత్ లో వచ్చే డబ్బు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.
వృశ్చికం:
కొన్ని ఖర్చులు ఉంటాయి. ఒక పనిని పూర్తి చేయడానికి కుటుంబ సభ్యుల సలహా తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉండే అవకాశం.
ధనస్సు:
కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు ఉండాలి. బంధువుల ద్వారా నగదు అందుతుంది. ఏ పనిచేయాలనుకున్నా.. ఆచితూచి వ్యవహరించాలి.
మకరం:
మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారులకు అంతంత మాత్రంగానే లాభాలు. ఏదైనా పనిచేసేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం మంచిది.
కుంభం:
ముఖ్యమైన పనిచేయాలనుకుంటనే అనుభవం ఉన్న వారిని సంప్రదించాలి. వ్యాపారులు పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయం.
మీనం:
జీవిత భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. పాత బంధువులను, స్నేహితులను కలుస్తారు. ఓ సమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది.