September Monthly Horoscope 2024: చాలా మందికి జాతకాలు తెలుసుకోవడం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అయితే తమ రాశి ఫలాలను తెలుసుకోవడం ద్వారా కొందరు వివిధ జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అయితే సెప్టెంబర్ నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉంది.. గ్రహాల సంచారం ఏ రాశుల వారికి ఫలిస్తుంది. అసలు ఏ ఏ గ్రహాలు ఎప్పుడెప్పుడు సంచరిస్తాయి.. ఇలాంటి వివరాలను తెలుసుకుందాం. సెప్టెంబర్ నెల గ్రహాల పరంగా పెద్దదిగా జ్యోతిష్య శాస్ర్తం చెబుతున్నది. ఈ నెలలో సూర్యుడు, శుక్రుడు, బుధుడు తమ రాశులను మార్చుకుంటాయి. దీంతో ఈ నెల మానవుల వ్యక్తిగత జీవితంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. బుదుడు కేవలం 21 రోజులు, సూర్యుడు నెల రోజులు, శుక్రుడు 26 రోజులు తమ రాశిని మార్చుకుంటాడు. ఇక ప్రస్తుతం కర్కాటక రాశిలో తిరోగమన దిశలో ఉన్న బుధుడు సెప్టెంబర్ 4న సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈనెలలోనే మరోసారి 23వ తేదీన కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత అక్టోబర్ 10న తులారాశిలోకి సంచరిస్తాడు. ఇక శుక్రుడు సెప్టెంబర్ 18న తులారాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత అక్టోబర్ 13న వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు సెప్టెంబర్ 16న కన్యారాశిలోకి సంచారం చేస్తాడు. అక్టోబర్ 17న తులారాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ కారణంగా ప్రధానంగా ఈ నెలలో 6 రాశఉల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతున్నది. ఇందులో మీనా, తులా, కన్యా, మేష, సింహ రాశుల వారు ఉన్నారు. వీరికి అదనపు ఆదాయ మార్గం అభిస్తుంది. పెండింగ్ ఫనులు పూర్తవుతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రమోషన్ లేదంటే వేతనం పెరుగుతుంది. సెప్టెంబర్ నెలలో గ్రహాల సంచారం 12 రాశులపై ప్రభావం చూపినా ఆరింటికి మాత్రం మంచి చేస్తాయి. ఇక రాశుల వారీగా ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషరాశి : వీరికి చాలా అదృష్టం కలిసి వస్తుంది. డబ్బు సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్, ఆదాయం పెరగడం ఖాయం. ఈ సమయంలో ఎంతో అనుకూలంగా సౌకర్యాలు పెరుగుతాయి. మేషరాశి వారికి సెప్టెంబర్ నెల అనుకూలించడం ఖాయం.
సింహరాశి : డబ్బు సంపాదనకు కొత్త మార్గం దొరుకుతుంది. వ్యాపర విస్తరణతో లాభాలు పొందుతారు. కోర్టు కేసుల్లో విజయం ఖాయం. లైఫ్ పార్టనర్ తో మంచి సమయం గడుపుతారు. జీవితంలో మీరు అనుకున్న కోరికలు తీరుతాయి.
కన్యారాశి : డబ్బు పొందుతారు. సామాజిక గౌరవం, కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. ఉద్యోగంలో మంచి వార్తలు వింటారు. అనుకున్న పనులు పూర్తవుతాయి. లక్ష్యాన్ని చేరుకుంటారు.
తులా రాశి : ఈ నెల వీరికి శుభప్రదం. అనుకూలమైన ఫలితాలు చూస్తారు. జీవితంలో ఆనందం, శాంతి ఉంటుంది. మీరు పెట్టబడిపై మంచి రాబడి పొందుతారు. అనుకున్న లక్ష్యంలో విజయం సాధిస్తారు. ఉద్యోగాల్లో కూడా విజయం సాధిస్తారు.
ధనస్సు రాశి : కొన్ని శుభవార్తలు వింటారు. పెండింగ్ పనులు పూర్తవడం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. సీనియర్ల నుంచి ఆఫీసుల్లో ప్రశంసలు పొందుతారు. వ్యాపారంలో లాభపడుతారు. అనుకున్న పనులు పూర్తవుతాయి.
మీన రాశి : సెప్టెంబర్ నెల వీరికి శుభాలను కలిగిస్తుంది. ఉన్న ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆర్థికంగా మంచిని పొందుతారు. గతంలో ఉన్న కుటుంబ సమస్యలు తీరుతాయి.
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: September monthly horoscope 2024 do you know the horoscope for the month of september
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com