Rashi Phalalu: ఈ రాశి వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి..

ఇప్పటి వరకు ఉన్న అనారోగ్య సమస్యలు తొలిగిపోయే అవకాశం ఉంది. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ఆస్తికి సంబంధించిన వివాదాలు ఈరోజుతో సమసిపోతాయి. ఉపాధికోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

Written By: Chai Muchhata, Updated On : January 2, 2024 9:17 am

Rashi Phalalu

Follow us on

Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జనవరి 2 మంగళవారం ద్వాదశ రాశులపై పూర్వ పాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు జరగనున్నాయి. అలాగే మరికొన్ని రాశులవారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. నేడు 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

మేషరాశి:
ఆర్థికపరమైన చిక్కులు ఉంటాయి. కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల నుంచి పూర్తిగా మద్దతు ఉంటుంది.

వృషభం:
ఇప్పటి వరకు ఉన్న అనారోగ్య సమస్యలు తొలిగిపోయే అవకాశం ఉంది. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ఆస్తికి సంబంధించిన వివాదాలు ఈరోజుతో సమసిపోతాయి. ఉపాధికోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

మిథునం:
జీవిత భాగస్వామితో ఒత్తిడి ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపుతారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. వ్యాపారస్తులకు పెట్టుబుడులు అనుకూల ఫలితాలు ఉంటాయి.

కర్కాటకం:
కష్టపడి చేసిన పనులు ఫలితాలు ఫలితాలు ఇస్తాయి. గతంలో ఇచ్చిన అప్పులు వసూలు అవుతాయి. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. అనుకున్న పనులు విజయం అవుతాయి.

సింహ:
కుటుంబంలో టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. మానసికంగా ఆందోళనగా ఉంటారు. అయితే ప్రియమైన వారితో గడపడం వల్ల సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది.

కన్య:
ఇంటికి అతిథులు వస్తారు. పనులన్నీ పూర్తి చేరస్తారు. ఇల్లు నిర్మాణాలపై శ్రద్ధ చూపుతారు. వ్యాపారంలో కొత్త పనులు ప్రారంభం అవుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

తుల:
ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సహోద్యోగులతో సంయమనం పాటించండి. కోర్టు సంబంధిత పనులు పూర్తవుతాయి. పెళ్లికి సిద్ధమయ్యే వారికి ప్రతిపాదలను వస్తాయి.

వృశ్చికం:
కుుటంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. విద్యారంగం వారికి ఆశించిన ప్రగతి కనిపిస్తుంది.

ధనస్సు:
ఖర్చులు పెరుగుతాయి. అయినా అనుకూల ఆదాయం వస్తుంది. కుటుంబంలో ప్రతికూల వాతవరణం కనిపిస్తుంది. ఉద్యోగులకు కార్యాలయాల్లో మద్దతు పెరుగుతుంది.

మకర:
ప్రియమైనవారితో సంతోషంగా ఉంటారు. ఉపాధి కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. వ్యాపరస్తులకు అనుకూల వాతావరణం ఉంటుంది.

కుంభం:
విలాసాల కోసం అధికంగా ఖర్చు చేస్తారు. వాదనలకు దిగకుండా జాగ్రత్తగా ఉండాలి. పర్యాటకం కోసం ప్లాన్ చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక, సైన్స్ పట్ల ఆసక్తికరంగా ఉంటారు.

మీనం:
జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపరస్తులకు లాభాలు పెరుగుతాయి.