Rashi Phalalu: ఈ రాశి వ్యాపారులకు సానుకూల వాతావరణం.. ఈరోజు 12 రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయంటే?

ఈ రాశిగల ఉద్యోగులకు కార్యాలయాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు ఆశించినంతంగా ఉంటాయి. స్నేహితులతో కలిసి పర్యటనలు చేస్తారు. మహిళలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

Written By: Chai Muchhata, Updated On : January 6, 2024 8:22 am

Rashi Phalalu

Follow us on

Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జనవరి 6 శనివారం ద్వాదశ రాశులపై స్వాతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో కొన్ని రాశుల వారికి శనిదేవుడి అనుగ్రహం ఉంటుంది. మేషం, మీన రాశుల వారికి ఆకస్మిక అదృష్టం రానుంది. అలాగే ఈరోజు 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

మేషరాశి:
ఈ రాశిగల ఉద్యోగులకు కార్యాలయాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు ఆశించినంతంగా ఉంటాయి. స్నేహితులతో కలిసి పర్యటనలు చేస్తారు. మహిళలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

వృషభం:
వ్యాపారవేత్తలకు సానుకూల వాతావరణం. ఉద్యోగులకు మాత్రం కార్యాలయంలో గందరగోళ వాతావరణం ఉంటుంది. ప్రభుత్వంలో పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి.

మిథునం:
ఆర్థికాంశాల్లో నిరాశ తప్పదు. అయితే సంబంధాలు మెరుగుపడుతాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా భారీగా నష్టం చేకూరుతుంది. ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి.

కర్కాటకం:
న్యాయపరమైన సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగులు, వ్యాపారులు తమ విధుల్లో ఆటంకాలు ఏర్పడుతాయి. కొత్త ఆదాయం వస్తుంది. భవిష్యత్ లో లాభాలు వచ్చే పెట్టుబడులు పెడుతారు.

సింహ:
కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుదాయి. కుటుంబంలో ఉల్లాసమైన వాతావరణం ఉంటుంది. కొన్ని మాటల వల్ల ఇతరులతో వాగ్వాదాలు ఏర్పడవచ్చు. బంధువుల నుంచి సానుకూల వార్తలు వింటారు.

కన్య:
కష్టపడి పనిచేసినా ఆశించిన ఫలితం ఉండకపోవచ్చు. దీంతో మానసికంగా ఆందోళనగా ఉంటారు. భవిష్యత్ కోసం అనేక ప్రణాళికలు వేస్తారు. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి.

తుల:
ఇరుగుపొరుగువారితో విభేదాలు రావొచ్చు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక సాయం అందుతుంది. వైవాహిక జీవితంలో సంయమనం పాటించాలి.

వృశ్చికం:
వ్యాపారులకు లాభాల పంట పండుతుంది. వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదొడుకులు ఏర్పడవచ్చు. తెలియని వారికి అప్పు ఇవ్వకపోవడమే మంచిది. కారణం లేకుండా ఉద్యోగులు ఆందోళన చెందుతారు.

ధనస్సు:
తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రలోభాలకు దూరంగా ఉండాలి. మిమ్మల్ని తప్పుదారిలో నడిపించేందుకు కొందరు ఉత్సాహపడుతారు. ముఖ్యంగా స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి.

మకర:
ఉద్యోగులు కార్యాలయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికపరమైన అంశాల్లో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపారులు పెట్టుబడి పెట్టేముందు ఇతరుల సలహాలు తీసుకోవాలి.

కుంభం:
కార్యాలయాల్లో ఉద్యోగులు తమ పనులు పూర్తి చేసేందుకు ఉన్నతాధికారుల సలహాలు తీసుకోవాలి. కొన్ని విమర్శలు వస్తాయి. సమాజంలో మీరు చేసే పనులు ఇతరులకు నచ్చుతాయి.

మీనం:
కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారులు తాము చేసే పనుల్లో ఇబ్బందులు పడుతారు. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు.