Homeఆధ్యాత్మికంRashi Phalalu: ఈ రాశి వారు ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి..

Rashi Phalalu: ఈ రాశి వారు ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి..

Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జనవరి 3 బుధవారం ద్వాదశ రాశులపై ఉత్తర పాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి శుభాలు జరగనున్నాయి. అలాగే మరికొన్ని రాశులవారికి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. నేడు 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

మేషరాశి:
భవిష్యత్ గురించి ఆలోచన చేస్తారు. వ్యాపారస్తులు ఇప్పుడు పెట్టుబడులు పెడితే లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. ప్రియమైన వారితో వాదనలకు దిగొద్దు. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తలు తీసుకోవాలి.

వృషభం:
ఈ రాశివారికి ఆదాయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయాల్లో సంతోషంగా గడుపుతారు. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

మిథునం:
మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. కొందరు శత్రువులు మీ దృష్టిని మరల్చే ప్రమాదం ఉంది. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. అవసరానికి మించి అప్పులు చేయకుండా ఉండడం మంచిది.

కర్కాటకం:
ఖర్చులు పెరిగే అవకాశం. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. ఊహించిన విధంగా లాభాలు వస్తాయి. కార్యాలయాల్లో ఉద్యోగులకు సీనియర్ల మద్దతు ఉంటుంది.

సింహ:
ఈ రాశివారు కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వివాహితులు ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగులు కార్యాయాల్లో ఆందోళనగా ఉంటారు. న్యాయపరమైన సమస్యలు తొలగిపోతాయి.

కన్య:
వ్యాపారస్తులకు పురోగతి లభిస్తుంది. ఎవరినైనా ప్రేమిస్తే వారితో మంచి ప్రవర్తించాలి. ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. మానసికంగా సంతృప్తిగా ఉంటారు.

తుల:
విహారయాత్రలకు వెళ్లేవారు వాయిదాలు వేసుకోవడం మంచిది. స్నేహితులతో కలిసి పార్టీకి ప్లాన్ వేస్తారు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. మానసికంగా ప్రశాంతంగా గడుపుతారు.

వృశ్చికం:
వాహనాలు నడిపేవారు జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడి, అలసటతో కనిపిస్తారు. ఉద్యోగులు ఆశించిన విజయాన్ని పొందుతారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి.

ధనస్సు:
వివాహితులు అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆదాయం ఆశించినంతగా ఉంటుంది. వ్యాపారస్తులు ప్రణాళికలు పూర్తి చేస్తారు. అయితే కొన్ని విషయాలను గోప్యంగా ఉంచుకోవడం మంచిది.

మకర:
వ్యాపారానికి సంబంధించి చేపట్టిన పనుల్లో పురోగతి కనిపిస్తుంది. అన్నిరంగాల్లో మద్దతు లభిస్తుంది. ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి.

కుంభం:
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే ఆశించిన ఫలితాలు ఉంటాయి. తొందరపాటుతో ఎలాంటి పనులు చేపట్టవద్దు. బకాయిలు రాబట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

మీనం:
మానసికంగా ప్రశాంతంగా గడుపుతారు. ఆర్థిక సమస్యల గురించి చర్చిస్తారు. ఉద్యోగులు ఆశించిన మేరకు విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version