Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవంబర్ 8న బుధవారం ద్వాదశ రాశులపై పూర్వ పాల్ఘుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో ఉద్యోగులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. మిగతా రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
కొత్త పనులు ప్రారంభిస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. మిత్రులతో ఉన్న వివాదాలు సద్దుమణుగుతాయి. వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కే అవకాశం.
వృషభం:
దూరపు బంధువులు కలుస్తారు. గతంలో చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి. రుణ సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారస్తులు భాగస్వాములతో ఉన్న వివాదాలు సమసిపోతాయి.
మిథునం:
కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగుల్లో ఉన్న గందరగోల వాతావరణం తొలగిపోతుంది. కళారంగం వారికి కొత్త అవకాశాలు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి.
కర్కాటకం:
శుభకార్యాల్లో పాల్గొంటారు. కొత్త ఉద్యోగాల్లో చేరుతారు. వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కుటుంబంలో ఉన్న గొడవలు తొలగిపోతాయి.
సింహం:
ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. అనారోగ్య సమస్యలు వస్తాయి. ధన వ్యయం అధికంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. లక్ష్యాలను నిర్దేశించుకుంటారు.
కన్య:
పారిశ్రామిక వర్గాలకు అనుకూలం. ఉద్యోగులు ఆటుపోట్లను ఎదుర్కొంటారు. వాహనాలు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
తుల:
పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. బంధువులతో వివాదాలు ఏర్పడే అవకాశం. గృహ నిర్మాణాలు ప్రారంభిస్తారు. వ్యాపారులు పెట్టుబడులు పెడుతారు.
వృశ్చికం:
ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. అనుకున్న సమయానికి డబ్బు అందుతుంది. ఖర్చులు పెరుగుతాయి. గతంలో ఉన్న సమస్య ల నుంచి బయటపడుతారు.
ధనస్సు:
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం. వ్యాపారస్తులకు లాభదాయంగా ఉంటుంది. ఉద్యోగులు ఉన్నత పదవులు దక్కించుకుంటారు.
మకరం:
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకున్న విధంగా ఉంటాయి. పట్టుదలతో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు.
కుంభం:
గతంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారం సాల్వూ అవుతుంది. స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలు తొలగిపోతాయి. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది.
మీనం:
స్థిరాస్తుల కొనుగోలును వాయిదా వేస్తారు. విదేశీ పర్యటనల్లో ఉత్సాహం చూపించరు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారులకు అనుకున్న ఫలితాలు ఉండకపోవచ్చు.