Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని పనులు చేయడంవల్ల అనుకూల ఫలితాలు ఉండే అవకాశం ఉంది. ప్రతిరోజూ ప్రతి వ్యక్తికి ఏదో ఒక రూపంలో సహకారం ఉంటుంది. అలాంటి విషయాలను ఆస్ట్రాలజీ తెలుపుతుంది. ఈ శాస్త్రం ప్రకారం 2023 అక్టోబర్ 11న బుధవారం 12 రాశిఫలాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
అనవసర ఖర్చులు పెరుగుతాయి. కీలకలావాదేవీల్లో జాగ్రత్తలు పాటించాలి. అవసరమైతే నిపుణుల సాయం తీసుకోవాలి. కొన్ని పనులు ఆటంకం కలుగుతాయి. అయినా మనోనిబ్బరంతో ముందుకు వెళ్లాలి. ఈ రాశివారు వేంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల సత్ఫలితాలు ఉంటాయి.
వృషభం:
కొన్ని పనులు తోటివారి సహకారంతో పూర్తవుతాయి. బంధుమిత్రులతో ఎక్కువగా వాదనలకు దిగొద్దు. ఇన్నాళ్లు చేస్తున్న ఒక పని సక్సెస్ అవుతుంది. పనితీరుపై ప్రశంసలు దక్కుతాయి. లలితాదేవిని పూజించడం ఉత్తమం.
మిథునం:
ఆర్థికంగా ఈ రాశివారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. పట్టుదలే ముందుకు నడిపిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి. శ్రీ విష్ణు ధ్యాన చేయాలి.
కర్కాటకం:
డెవలప్మెంట్ కోసం చేసే కొన్నిపనులు నెరవేరుతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. మానసికంగా ధృఢంగా ఉంటారు. మనోబలంతో ముందుకు సాగండి.. అనుకున్నది సాధిస్తారు. ఇష్టదైవాన్ని పూజించడం వల్ల సత్ఫలితాలు.
సింహం:
కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. కటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఈ రాశివారికి గ్రహబలం అధికంగా ఉంటుంది. ఇష్టదైవాన్ని పూజించాలి. .
కన్య:
కొన్ని పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని మనోబలంతో ముందుకు సాగిస్తారు. ఓ వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. అలాంటి వారికి దూరంగా ఉండడం మంచిది. సూర్యదేవుని పూజతో అనుకూల ఫలితాలు.
తుల:
కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. మానసికంగా ధృఢంగా ఉంటారు. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. కొన్ని వ్యవహారాల్లో నిర్లక్ష్యం చేయొద్దు. గో పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు.
వృశ్చికం:
ఆత్మవిశ్వాసంతో చేసే పనులు సక్సెస్ అవుతాయి. పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. అవసరానికి సాయం చేసేవారు ముందుకు వస్తారు. విష్ణపూజలతో అనుకూల ఫలితాలు.
ధనస్సు:
భక్తిశ్రద్ధలతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి.
మకరం:
చంచల మనస్తత్వం ఉన్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటారు. బంధువులతో ఎక్కువగా వాదనలకు దిగొద్దు. వారితో ఆచి తూచి వ్యవహరించాలి. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయొద్దు. శ్రీ వేంకటేశ్వరస్వామిని పూజించడం వల్ల సత్ఫలితాలు.
కుంభం:
కీలక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. వైరగ్యంతో ఉండకూడదు. ఇష్టదైవాన్ని పూజించాలి.
మీనం:
ఒక వార్త సంతోషాన్ని కలిగిస్తుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. అనుకున్న ఫలితాలు ఉంటాయి. కనకధార స్తోత్రం చదవడం వల్ల మరింత మంచి జరుగుతుంది.