Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవంబర్ 27న సోమవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ద్వాదశ రాశులపై కృత్తిక నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో మేషం, సింహంతో పాటు పలు రాశుల వారిపై ప్రభావం ఉండనున్నాయి. 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
మేషరాశి:
కార్తీక పౌర్ణమి సందర్భంగా మేష రాశి వారు సంతోషంగా ఉంటాయి. ఆర్థికంగా మంచి ఫలితాలు ఉంటాయి. అయితే కొన్ని ఖర్చులను నియంత్రించాల్సి ఉంటుంది.
వృషభం:
కుటుంబ అవసరాలకు ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం పెంచుకోవడం కోసం ప్రణాళికలు వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మిథునం:
కొన్ని పనుల విషయంలో వీరు కష్టపడాల్సి వస్తుంది. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. భగవంతుని దర్శనం కోసం తీర్థయాత్రలకు వెళ్తారు.
కర్కాటకం:
ఓ సమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది. ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం కనుగొంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
సింహం:
సింహారాశి వారికి కార్తీక పౌర్ణమి ప్రభావం ఉంటుంది. ఈరోజు ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు. ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి. సలహాలు తీసుకోవడానికి ఇతరులను సంప్రదించాలి.
కన్య:
కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబంలో తండ్రి మార్గదర్శకంలో నడుస్తారు. చాలాకాలంగా పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి.
తుల:
వ్యాపారులకు అనుకూలమైన రోజు పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయి. వివాహం చేసుకునేవారికి ప్రతిపాదనలు వస్తాయి. స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చికం:
బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ధనస్సు:
ఏ సమస్య వచ్చినా ఓపికతో పరిష్కరించుకోవాలి. ఎక్కువగా వాదనలకు దిగొద్దు. మహిళా ఉద్యోగులు అన్ని విషయాలలో రాణిస్తారు. వ్యాపారులకు అనుకూల సమయం.
మకరం:
బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. వీటి నియంత్రణ కోసం ప్రణాళికలు వేయాలి. వివాదాలకు దూరంగా ఉండడమే మంచిది.
కుంభం:
తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. శుభకార్యం గురించి చర్చిస్తారు. కొత్త పెట్టుబడులు మనస్పూర్తిగా పెట్టాలి.
మీనం:
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెండింగు పనులను పూర్తి చేస్తారు. వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.