Homeఆధ్యాత్మికంKarthika Masam 2024: కార్తీక మాస అమావాస్య రోజు ఈ పూజలు చేస్తే డబ్బేడబ్బు.. ఏం...

Karthika Masam 2024: కార్తీక మాస అమావాస్య రోజు ఈ పూజలు చేస్తే డబ్బేడబ్బు.. ఏం చేయాలంటే?

Karthika Masam 2024: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతినెల అమావాస్య , పౌర్ణమి రోజులను ప్రత్యేకంగా పరిగణింబడుతాయి.ఈ రోజుల్లో కొన్ని పనులను నిర్వహిస్తూ ఉంటారు. అయితే అమావాస్య రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించడానికి ఇష్టపడరు. ఈరోజు పూజలు చేయడం వల్ల ఫలితాలు ఉండవని అంటారు. కానీ కొన్ని పంగచాల ప్రకారం కార్తీక మాసం చివరి రోజున వచ్చే అమావాస్య రోజున కొన్ని ప్రత్యేక పూజలు చేయడం వల్ల వద్దన్నా డబ్బు వస్తుందని కొందరు పండితులు చెబుతున్నారు. ఈరోజు మహావిష్ణుతో పాటు లక్ష్మీదేవి అమ్మవారికి పూజలు చేయడం వల్ల అనుకున్న ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

కార్తీక మాసం పూర్తయిన తరువాత మార్గశిర మాసం ప్రారంభం అవుతుంది. పరమ పవిత్రంగా భావించే కార్తీక మాసంలో శివకేశవులుకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే ఈ మాసం చివరి రోజు వచ్చే అమావాస్యను కూడా ప్రత్యేకగా పరిగణిస్తున్నారు. ఈ అమావాస్యను అఘన అమావాస్య, భౌమవతి అమావాస్య అని కూడా అంటారు. కొన్ని పురాణాల ప్రకారం ఈ అమావాస్య రోజున గంగాస్నానం చేయడంతో పాటు మహావిష్ణువు, లక్ష్మీదేవి అమ్మవారిని పూజలు చేయడం వల్ల ఆ దేవి అనుగ్రహం ఉంటుందని అంటున్నారు. అలాగే ఈరోజు పిండ ప్రదానం చేయడం వల్ల పూర్వీకులు సంతోషిస్తారని అంటున్నారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవంబర్ 30న శనివారం ఉదయం 10.29 గంటల నుంచి  అఘన అమావాస్య ప్రారంభం అవుతుంది.మరుసటి రోజు ఉదయం 11.55 గంటలకు ముగుస్తుంది. అయితే క్యాలెండర్లో డిసెంబర్ 1న అమావాస్య చూపిస్తుంది. అయితే మిగతా రోజుల్లో ఎలాంటి పూజలు చేయకున్నా.. ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారికి పూజలు చేయడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయని అంటున్నారు. ఈ పూజల్లో భాగంగా మహాలక్ష్మి అమ్మవారిని 108 నామాలతో కొలవడం వల్ల మరిన్ని ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.

చాలా మంది ఆర్థిక సమస్యలు బాధపడుతూ ఉంటారు. కొందరు ఎంత పనిచేసినా చేతిలో డబ్బు నిల్వదు. ఎంత పెద్ద వ్యాపారం నిర్వహిస్తున్నా సమయానికి నగదు దొరకదు. ఇలాంటి వారు ఈ అమావాస్య రోజున పూజలు చేయడం వల్ల ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఇన్నాళ్లు ఆర్థిక సమస్యలతో బాధపడేవారు. ఈరోజు  నుంచి వద్దన్నా డబ్బు వస్తుందని అంటున్నారు. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. వ్యాపారులు ఊహించని లాభాలు పొందుతారు. ఉద్యోగులు కొత్త ఆదాయాన్ని పొందుతారు.

చాలా మంది ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిల్వదు. ఈరోజు ఇంట్లో ఈ పూజలు చేయడం వల్ల ఇల్లు ధనంతో నిండిపోతుంది. ఎలాంటి అదనపు ఖర్చులు లేకుండా జీవితం సాఫీగా సాగుతుంది. ఎన్ని ఖర్చులున్నా.. ఏదో విధంగా ఇంట్లోకి డబ్బు వస్తుంది. వచ్చిన డబ్బు నిల్వ ఉంటుంది. కొందరు అనారోగ్య సమస్యలు బాధపడేవారు సైతం ఈరోజుతో ఆరోగ్యంగా మారుతారు. విద్యార్థులకు సంబంధించి కెరీర్ బాగుంటుంది.  భవిష్యత్ లో ఏదైనా ప్రాజెక్టును ప్రారంభించాలనుకుంటే అది సక్సెస్ అవుతుంది. అందువల్ల ఈ రోజు లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం పొందేలా ప్రయత్నించండి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version