Horoscope Today: ఈ రాశి వారికి అనుకోని అదృష్టం వరిస్తుంది..

Horoscope Today: 2024 జూన్ 5 బుధవారం రోజున ద్వాదశ రాశులపై కృత్తిక నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు వృషభ రాశిలో సంచారం చేయనున్నాడు. బుధవారం 5 రాశుల వారికి అనుకోని ప్రయోజనాలు ఉండనున్నాయి.

Written By: Srinivas, Updated On : June 5, 2024 7:06 am

Horoscope today

Follow us on

Horoscope Today: 2024 జూన్ 5 బుధవారం రోజున ద్వాదశ రాశులపై కృత్తిక నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు వృషభ రాశిలో సంచారం చేయనున్నాడు. బుధవారం 5 రాశుల వారికి అనుకోని ప్రయోజనాలు ఉండనున్నాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి:
ఈ రాశి వారు ఈ రోజు ప్రశాంతంగా ఉంటారు. అనవసర వాదనలకు దిగకుండా ఉండాలి. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. పిల్లల కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు.

వృషభ రాశి:
ఆర్థిక వ్యవహారాలు జరిపేవారు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు. పిల్లల కెరీర్ పై కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు సోదరుల సలహాలతో కొత్త పెట్టుబడులు పెడతారు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించండి

మిథున రాశి:
కొందరు తప్పుడు సలహాలు ఇస్తారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార అభివృద్ధికి కొత్త ప్రణాళికలు వేస్తారు. దీంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగులు తోటి వారితో ఉల్లాసంగా ఉంటారు.

కర్కాటక రాశి:
ఉద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారులు ఎగుమతి, దిగుమతి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. పిల్లల కెరియర్ కి సంబంధించి ఒత్తిడిని ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామితో అనవసర వాదనలకు దిగద్దు.

సింహారాశి:
కొన్ని విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగులు పదోన్నతుల విషయంలో శుభవార్త వింటారు. వ్యాపారులు లాభాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తారు. అనవసరంగా ఇతతుల జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిది

కన్య రాశి:
కుటుంబ వాతావరణం ఆహ్లదంగా ఉంటుంది. పూర్వీకుల ఆస్తి విషయంలో శుభవార్త వింటారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రెడీ అవుతారు. వ్యాపారంలో పెట్టుబడులపై ఇతరుల సలహా తీసుకోవడం మంచిది.

తుల రాశి:
ఈ రాశి వారికి ఈ రోజు అనుకోని అదృష్టం వరిస్తుంది. ఏ పని చేసిన విజయం సాధిస్తారు. పాత పథకాల నుంచి ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారులు కు అనుకోని ధనం వచ్చి పడుతుంది. ప్రయాణంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి .

వృశ్చిక రాశి:
ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు.ఉద్యోగులు కార్యాలయంలో చేసే పనులపై శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి.

ధనస్సు రాశి:
పాత స్నేహితులను కలుస్తారు. వారి మద్దతు ద్వారా ఉల్లాసంగా గడుపుతారు. శుభ కార్యక్రమంలో పాల్గొంటారు. కొన్ని లక్ష్యాలను పూర్తి చేసి కొత్త లక్ష్యాలను ఏర్పరచుకుంటారు. జీవితం ఉత్సాహంగా సాగుతుంది.

మకర రాశి:
ఉద్యోగులకు కార్యాలయాల్లో కొత్త బాధ్యతలు ఏర్పడతాయి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యమైన విషయాలను పై నిర్లక్ష్యంగా ఉండదు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కుంభరాశి:
పాత స్నేహితులను కలవడం వలన ఉత్సాహం పెరుగుతుంది. విద్యార్థులు ఒత్తిడి నుంచి దూరం అవుతారు. విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. కొందరు తమ ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు.

మీనరాశి:
ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఉత్సాహం చూపుతారు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు కీలక నిర్ణయాలు తీసుకుంటారు.