Horoscope October 4: మేషరాశి:
తోటివారితో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పని ప్రారంభించాలనుకుంటే వాటిపై అలసట చెందకూడదు. కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. అయితే శివనామాన్నిజపిస్తే ఫలితం ఉంటుంది.
వృషభం:
అసాధరణ పట్టుదలను కలిగి ఉంటారు. ఇంతకాలం చేయాలనుకున్నపనులు చేస్తారు. కొత్త నైపుణ్యం అలవడుతుంది. మరికొన్ని పనులుకావాలంటే ఇష్టదైవాన్ని ప్రార్థించాలి.
మిథునం:
ఆర్థిక అవసరాలు అనుకోని విధంగా పెరిగే అవకాశం ఉంది. మనశ్శాంతిని కోల్పోతారు. ఆంజనేయుడిని తలచుకోవడం ద్వారా ఫలితం ఉంటుంది.
కర్కాటకం:
ఈ రాశివారికి శుభదినం. అన్నీ మంచి శకునములే. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. తమకు ఇష్టమైన దైవాన్ని ప్రార్థిస్తే మరింత మేలు జరిగే అవకాశం ఉంది.
సింహం:
కుటుంబ సభ్యుల నుంచి శుభవార్త వింటారు. ప్రతిభకు తగిన ప్రోత్సాహం ఉంటుంది. నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు. శ్రీవారి సేవ చేయడం ఉత్తమం.
కన్య:
ఊహించని సంఘటనలు జరుగుతాయి. భవిష్యత్ కు సంబంధించిన ప్లాన్ వేస్తారు. పనుల్లో ఆటంకాలను అధిగమిస్తారు. శివస్మరణ చేయడం మంచిది.
తుల:
సొంత నిర్ణయాలు లాభిస్తాయి. ఉద్యోగంలో అధికారుల సహకారం ఉంటుంది. అయితే లక్ష్యంపై ఏకాగ్రతను కోల్పోకూడదు. దుర్గాదేవి పూజ చేయడంతో మంచి ఫలితాలు ఉంటాయి.
వృశ్చికం:
ఒక వార్త మనశ్నాంతి లేకుండా చేస్తుంది. కానీ ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేస్తారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ముందుకు సాగితే అనుకున్నవి పూర్తి చేస్తారు. సూర్య దేవుడిని స్మరించాలి.
ధనస్సు:
పట్టుదలతో కలిగి ఉంటారు. ఇదే అనుకూలిస్తుంది. ఉద్యోగం, వ్యాపారం చేసేవారు ఆచితూచి అడుగులు వేయాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. లక్ష్మీధ్యానం చేయడం వల్ల మనో ధైర్యం పెరుగుతుంది.
మకరం:
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శుభవార్త వింటారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. శివారాధన మరిన్ని ఫలితాలు ఇస్తుంది.
కుంభం:
కీలక విషయాలు కొన్నాళ్ల పాటు వాయిదా వేసుకోవడం మంచింది. వృత్తి పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవాన్ని ప్రార్థించాలి.
మీనం:
గతంలో మొదలు పెట్టిన పనులు పూర్తి చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తూ ఉండాలి.