Horoscope Today : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 ఫిబ్రవరి 3న ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ కారణంగా ఓ రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. మరో రాశి ఉద్యోగులు కొత్త ప్రయత్నాలు చేస్తారు. ఈ నేపథ్యంలో శనివారం మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఈ రాశివారికి గతంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. వివాదాల్లో తలదూర్చకుండా ఉండడమే మంచిది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది.
వృషభ రాశి:
వ్యాపారంలో లాభాలు వస్తాయి. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. కొన్నిపనుల కారణంగా నీరసంగా ఉంటారు. అయితే విహారయాత్రలకు వెళ్లేవారు సంతోషంగా ఉంటారు.
మిథునం:
వ్యాపారులు ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు కొత్త ప్రయాణాలు చేస్తారు. ఒకరికొకరు గౌరవించుకుంటారు.
కర్కాటకం:
జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కొన్ని రంగాలకు చెందిన ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. వివాహితులు ఉల్లాసంగా గడుపుతారు.
సింహ:
పాత స్నేహితులను కలుస్తారు. వ్యాపారంలో పెట్టుబడులు పెడితే ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలి. ఉద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయి.
కన్య:
ఈ రాశిరారికి శత్రువుల నుంచి విముక్తి కలుగుతుంది. కాస్త శ్రద్ధ పెడితే లాభాలు వస్తాయి. ఆన్ లైన్ లో వర్క్ చేసేవారికి ఉపాధి అవకాశాలు ఉంటాయి.
తుల:
కొన్ని శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో మనశ్శాంతి లభిస్తుంది. ఒంటరిగా ఉండకుండా ఇతరులతో సంబంధాలు పెంచుకోవాలి.
వృశ్చికం:
ఉద్యోగులు విధులను సక్రమంగా నిర్వహించాలి. లేకుంటే ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ జీవితం ఆహ్లాదకంగా ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.
ధనస్సు:
రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు పెట్టుబడి పెట్టే ముందు ఆలోచించాలి. ఉద్యోగులు కొత్త ఉద్యోగానికి వెళ్లే ముందు ఆలోచించాలి.
మకర:
విద్యార్థులు పరీక్షల్లో రాణిస్తారు. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. స్నేహితులతో సరదాగా ఉంటారు. విహార యాత్రలకు వెళ్లడానికి ప్లాన్ చేస్తారు.
కుంభం:
జీవిత భాగస్వామితో సన్నిహితంగా ఉంటారు. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని పెట్టుబడులు పెడుతారు. వ్యాపారుల పెట్టుబడులకు అనుకూల వాతావరణం.
మీనం:
ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులు తమ విధులపై శ్రద్ధ వహించాలి. ఆకస్మికంగా ధనలాభం ఉంటుంది. వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది.