Horoscope Today :జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 జనవరి 25 గురువారం ఓ రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే కుటుంబంలో అశాంతి నెలకొంటుంది. ఈరోజు ద్వాదశ రాశులపై పునర్వసు నక్షత్ర ప్రభావం ఉంటుంది. అలాగే పుష్య పౌర్ణమి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉండనున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీనం వరకు 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
మేషరాశి:
వ్యాపారులకు భారీ లాభాలు వస్తాయి. కొత్త పనిని ప్రారంభించాలనుకునేవారికి అనుకూలం. ఆరోగ్య సమస్యలు కొన్ని వెంటాడుతాయి. ఉద్యోగులకు కార్యాలయాల్లో మద్దతు లభిస్తుంది.
వృషభం:
వాహనాల కొనుగోలు విషయంలో నిర్లక్ల్యంగా ఉండొద్దు. బంధువుల నుంచి మద్దతు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. కొన్ని వ్యాధులు ఇబ్బంది పెడుతాయి.
మిథునం:
కొన్ని పనుల్లో అడ్డంకులు ఏర్పడుతాయి. ఊహించిన అనుభవం పొందుతారు. వ్యాపారులకు నష్టాలు వస్తాయి. ప్రతిభ ఉపయోగించడం ద్వారా కొన్ని పనులు సక్సెస్ అవుతాయి.
కర్కాటకం:
ఆర్థికంగా చాలా నష్టాలు ఉంటాయి. తొందరపడి ఏ పనులు చేయొద్దు. కొపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే ఇంట్లో అశాంతి నెలకొంటుంది.
సింహ:
ఉద్యోగులుకు బాధ్యతలు పెరగొచ్చు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొన్ని రంగాల వారికి ఆకస్మిక అదృష్టం . జీవిత భాగస్వామి మద్దతుతో ఓ పని సక్సెస్ అవుతుంది.
కన్య:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇతరులకు అప్పు ఇచ్చే విషయంలో జాగ్రత్తలు పడాలి. ప్రయాణాలు చేస్తారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
తుల:
కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పెట్టుబడులకు లాభాలు వస్తాయి. అప్పులు తగ్గుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రశాంతంగా ఉంటారు.
వృశ్చికం:
వ్యాపారులకు లాభదాయకమైన అవకాశాలు. కొన్నిపనుల్లో చాకచక్యంగా వ్యవహరించాలి. ఆన్ లైన్ లో షాపింగ్ చేసేవారు మోసపోయే అవకాశం.
ధనస్సు:
ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. జీవిత భాగస్వామి మధ్య విభేదాలు ఉండొచ్చు. ఏదైనా విషయంలో తొందరపడకండి. ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది.
మకర:
అప్పులు వసూలు చేయడానికి కష్టపడుతారు. ప్రతికూల వాతావరణం ఉన్నా.. ధైర్యంగా ముందుకు వెళ్లాలి. లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కుంభం:
ఎక్కువగా వాదనలు చేయొద్దు. ప్రయాణాలు చేస్తారు. ఆహారం తీసుకోవడంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రత్యుర్థులతో తలపడితే విజయం మీదే. ఈరోజు అనుకూలంగా ఉంటుంది.
మీనం:
కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రయాణాలు చేయాల్సి ఉన్నా.. వాయిదాలు వేసుకోవాలి. వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.