Horoscope Today:జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 మార్చి 11న ద్వాదశ రాశులపై రేవతి నక్షత్ర ప్రభావం ఉంటుంది.సోమవారం చంద్రుడు మీన రాశిలో సంచరించనున్నాడు. ఈ కారణంగా ఉద్యోగులు కొన్ని పనుల్లో ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. మరో రాశి వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. అలాగే మిగతా రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఇప్పటికే మొదలు పెట్టిన పనులు సకాలంలో పూర్తి చేయాలి. లేకుంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.
వృషభ రాశి:
పాత స్నేహితులను కలుస్తారు. దీంతో ఉల్లాసంగా గడుపుతారు. కుటంబంలో ఎవరితోనూ వివాదం కొని తెచ్చుకోవద్దు. వివాహితులకు కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి.
మిథునం:
ఆదాయం పెరుగుతుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. కుటుంబ సభ్యుల్లో ఒకరు అనారోగ్యానికి గురవుతారు. కొన్ని పనుల కోసం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది.
కర్కాటకం:
కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారులు కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంటారు. కొందరు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి.
సింహ:
కొన్ని ప్రత్యేక వేడుకలకు హాజరవుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ప్రత్యర్థులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కన్య:
ఆదాయం పెరుగుతుంది. కానీ ఖర్చలు కూడా అంతే స్థాయిలో ఉంటాయి. ఇతరులను ఎక్కువగా నమ్మొద్దు. కొన్ని రంగాల వారికి అనుకున్న పనులు నెరవేరుతాయి.
తుల:
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోదరుల మద్దతు ఎక్కువగా ఉంటుంది. కొన్ని పనులు వాయిదా పడుతాయి. ఇతరులకు ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వస్తారు.
వృశ్చికం:
ప్రియమైన వారితో అపార్థాలు జరగొచ్చు. దీంతో కొంత నిరాశతో ఉంటారు. సామాజిక రంగాల్లో వారికి ఆశాజనక ఫలితాలు ఉంటాయి. కొన్ని మాటల ద్వారా ఇతరులతో గొడవలు ఏర్పడుతాయి.
ధనస్సు:
మీకు కట్టబెట్టిన బాధ్యతలను పూర్తిచేస్తారు. గతంలో మొదలు పెట్టిన పనిని విజయవంతంగా చేస్తారు. వ్యాపారం చేసేవారు కొందరికి దూరంగా దూరంగా ఉండడమే మంచిది.
మకర:
కుటుంబ సభ్యుల అంగీకారంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులు కార్యాలయాల్లో తోటివారితో స్నేహాంగా ఉంటారు. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో పెద్దల సలహా తీసుకోవాలి.
కుంభం:
వైవాహిక జీవిత కొనసాగిస్తున్న వారు సంతోషంగా ఉంటారు. రాబడులు పెరుగుతాయి. విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మీనం:
ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. వైవాహిక జీవితంలోని వారికి కొన్ని ఒడిదొడుకులు ఏర్పడుతాయి. ఆస్తిని కొనుగోలు చేసే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.