Rashi Phalalu: ఈ రాశి ఉద్యోగులకు ఆర్థిక పరమైన చిక్కులు.. 12 రాశిఫలాలు ఏవిధంగా ఉన్నాయంటే?

వ్యాపారులకు అనుకూల సమయం. పెట్టుబడులు పెడితే భవిష్యత్ లో లాభదాయకంగా ఉంటుంది. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. కొన్ని మాటలు వారిని సంతృప్తినిస్తాయి.

Written By: Chai Muchhata, Updated On : December 20, 2023 9:23 am

Rashi Phalalu

Follow us on

Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. డిసెంబర్ 19న బుధవారం ద్వాదశ రాశులపై ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో మిథునం, కర్కాటకం రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయి. ఈ సందర్భంగా 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

మేషరాశి:
వ్యాపారులకు అనుకూల సమయం. పెట్టుబడులు పెడితే భవిష్యత్ లో లాభదాయకంగా ఉంటుంది. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. కొన్ని మాటలు వారిని సంతృప్తినిస్తాయి.

వృషభం:
ఇతరుల వద్ద అప్పు తీసుకోవాలనుకుంటే కొంత కాలం వేచి ఉండాలి. వివాహ సంబంధిత ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. బడ్జెట్ కు అనుగుణంగా పరీక్షలు చేయాల్సి ఉంటుంది.

మిథునం:
వ్యాపారంలో పెట్టుబడుల కోసం స్నేహితుల నుంచి సలహాలు తీసుకోవచ్చు. కుటుంబం సభ్యులతో సంతోషంగా ఉంటారు. కొన్ని వివాదాలు నిరాశ పరుస్తాయి.

కర్కాటకం:
ఉపాధి కోసం ప్రయత్నాలు చేసేవారికి అనుకూల ఫలితాలు. సామాజిక రంగంలో పనిచేసేవారికి గౌరవం పెరుగుతుంది. కొన్ని ఆందోళనల నుంచి ఉపశమనం పొందుతారు.

సింహ:
ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. వ్యాపారులు ఒకరి సాయంతో జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. వ్యాపారం సంబంధిత పర్యటనలకు వెళ్లాల్సి ఉంటుంది.

కన్య:
ఆహారపు అలవాట్లను నియంత్రించాలి. లేకుంటే అనారోగ్యాల పాలు కావొచ్చు. ఉద్యోగులు తమ కార్యాలయంలో తమకు ఇష్టమైన పనిని కేటాయించే అవకాశం ఉంది. సాయంత్రా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

తుల:
విహారయాత్రలకు వెళ్లొచ్చు. బంధువులతో కలిసి సంతోషంగా ఉంటారు. సాయంత్రం ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఉద్యోగులకు తోటివారి మద్దతు లభిస్తుంది.

వృశ్చికం:
శత్రువులపై ఆధిపత్యం చెలాయిస్తారు. వ్యాపారులకు సానుకూల ఫలితాలు ఉంటాయి. కొన్ని పనుల్లో సమస్యలు ఎదురయ్యే అవకాశం. విద్యార్థులకు ఉపాధ్యాయుల నుంచి మద్దతు లభిస్తుంది.

ధనస్సు:
జీవిత భాగస్వామితో విహారయ యాత్రలకు వెళ్తారు. రుణం తీసుకోవాలంటే జాగ్రత్తలు పాటించాలి. సామాజిక సేవ చేయడంలో ముందుంటారు.

మకర:
మీ చుట్టూ ఉండే వాతావరణం ఆహ్లదకరంగా ఉంటుంది. వ్యాపారులు పెట్టుబడులు పెడితే ఆశించిన లాభాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి.

కుంభం:
కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్తలు పడుతారు. కొన్న సమస్యలు నిరాశను కలిగిస్తాయి. అయినా అధైర్యపడొద్దు. వివాదాల జోలికి పోకుండా ఉండడం మంచిది.

మీనం: ఉద్యోగులకు ఆర్థిక పరమైన సమస్యలు వస్తాయి. కుటుంబ సభ్యుల సాయం అందుతుంది. కొన్ని ఆర్థిక అవసరాలకు అప్పులు చేయాల్సి వస్తుంది. సాయంత్రం విహారయాత్రలకు వెళ్తారు.