కొమురం భీం జిల్లాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టుల మృతి..
పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. కుమరం భీం జిల్లా కడంబా అడవుల్లో శనివారం అర్ధరాతి ఈ సంఘటన చోటు చేసుకుంది. గత కొంత కాలంగా ఈ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందడంపై కలకలం రేపుతోంది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో రెండు తుపాకులు, బ్యాగులు లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉండగా మావోయిస్టు ముఖ్యనేత అడేళ్లు అలియాస్ భాస్కర్ […]
పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. కుమరం భీం జిల్లా కడంబా అడవుల్లో శనివారం అర్ధరాతి ఈ సంఘటన చోటు చేసుకుంది. గత కొంత కాలంగా ఈ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందడంపై కలకలం రేపుతోంది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో రెండు తుపాకులు, బ్యాగులు లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉండగా మావోయిస్టు ముఖ్యనేత అడేళ్లు అలియాస్ భాస్కర్ తృటిలో తప్పించుకున్నట్లు సమాచారం.