https://oktelugu.com/

Samantha: నిన్ను ఇక ఎప్పుడూ నమ్ముతా.. స్టార్ హీరోపై సమంత హాట్ కామెంట్

Samantha: బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత నాగచైతన్యతో డైవోర్స్ తర్వాత తన ప్రొఫెషనల్ కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. ప్రజెంట్ ఈ భామ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తోంది. పాన్ ఇండియా ఫిల్మ్స్ మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ ఫిల్మ్స్‌లోనూ సమంత తన సత్తా చాటబోతున్నది. కాగా, తాజాగా సమంత ఓ స్టార్ హీరోపైన హాట్ కామెంట్ చేసింది. ట్విట్టర్ వేదికగా ఆమె చేసిన ట్వీట్ ప్రజెంట్ సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరంటే.. సమంత తన […]

Written By:
  • Mallesh
  • , Updated On : December 29, 2021 / 03:31 PM IST
    Follow us on

    Samantha: బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత నాగచైతన్యతో డైవోర్స్ తర్వాత తన ప్రొఫెషనల్ కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. ప్రజెంట్ ఈ భామ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తోంది. పాన్ ఇండియా ఫిల్మ్స్ మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ ఫిల్మ్స్‌లోనూ సమంత తన సత్తా చాటబోతున్నది. కాగా, తాజాగా సమంత ఓ స్టార్ హీరోపైన హాట్ కామెంట్ చేసింది. ట్విట్టర్ వేదికగా ఆమె చేసిన ట్వీట్ ప్రజెంట్ సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరంటే..

    samantha

    సమంత తన కెరీర్‌లో తొలిసారి పాన్‌ ఇండియా మూవీ ‘పుష్ప’లో స్పెషల్ సాంగ్ చేసింది. ఈ ‘ఊ అంటావా’అనే సాంగ్‌ ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నిటినీ తిరగ రాసింది. యూట్యూబ్‌లో టాప్‌  హండ్రెడ్ మ్యూజిక్ వీడియోలలో తొలి స్థానంలో ఇది ఉండటం విశేషం. ఇకపోతే బన్నీ చేసిన తొలి పాన్ ఇండియా సినిమా ఇది. కాగా,తాజాగా ‘పుష్ప’ థాంక్స్ మీట్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సమంతకు స్పెషల్ థాంక్స్ చెప్పారు. ఈ పాటను మీరు ఎంత నమ్మారో తెలియదు కానీ.. తమ మీద నమ్మకంతో చేసినందుకుగాను కృతజ్ఞతలు తెలిపారు. తనను నమ్మి సాంగ్ చేయాలని సెట్‌లో తాను చెప్పానని పేర్కొన్న బన్నీ, అడిగిన వెంటనే సాంగ్ చేసినందుకుగాను తన గుండెలో స్థానం పొందారని పేర్కొన్నాడు. వరల్డ్‌లోనే నెంబర్ వన్ సాంగ్‌గా ‘ఊ అంటావా.. మావా’ సాంగ్ యూట్యూబ్‌లో నిలబడటం అంటే మామూలు విషయం కాదని బన్నీ సమంతను ప్రశంసించాడు.

    Also Read:  నేచురల్ స్టార్ నాని గాలి తీసిన ఎమ్మెల్యే రోజా..

    ఇకపోతే బన్నీ వ్యాఖ్యలకుగానూ సమంత రిప్లయి ఇచ్చింది. ఇకపై తాను అల్లు అర్జున్‌ను ఎప్పటికీ నమ్ముతానని సమంత ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కుబన్నీ మాటల వీడియోను జత చేసింది. సమంత చేసిన ఈ ట్వీట్ ప్రజెంట్ నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ సంగతులు అలా ఉంచితే.. సమంత సినిమాల విషయానికొస్తే ఇప్పటికే పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాకుంతలం’పూర్తి చేసింది. మరో పాన్ ఇండియా ఫిల్మ్ ‘యశోద’ షూటింగ్‌లో త్వరలో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.

    Also Read:  ఎన్టీఆర్ – చరణ్ మధ్య ఫైట్.. ఆర్ఆర్ఆర్ పై లేటెస్ట్ అప్ డేట్ !

    Tags