HomeMoviesSurprise from Liger: లైగర్ నుంచి మరో సర్ ప్రైజ్ కు రెడీ

Surprise from Liger: లైగర్ నుంచి మరో సర్ ప్రైజ్ కు రెడీ

Surprise from Liger: పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కలయికలో లైగర్ సినిమా వస్తోంది. అందరి అంచనాలు నిజం చేస్తూ సినిమా సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు. దీంతో లైగర్ పై ఇప్పటికే అభిమానుల్లో ఆతృత నెలకొంది. పూరీ జగన్నాథ్ సినిమాలు వాణిజ్యపరంగా విజయం సాధిస్తుంటాయి. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం నుంచి నేటి లైగర్ వరకు ఎన్నో వైవిధ్యాలు చూపిస్తూ సినిమా సినిమాకు క్రేజీ పెరుగుతోంది. రామ్ హీరోగా నిర్మించిన ఇస్మార్ట్ శంకర్ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఈ నేపథ్యంలో లైగర్ కూడా అంతకు మించి విజయం సాధిస్తుందని అభిమానుల ఆశగా కనిపిస్తోంది.

Surprise from Liger
Surprise from Liger

Also Read: Pawan Kalyan Jalsa Special Shows: 15 రోజుల ముందే రికార్డ్స్ బద్దలు కొట్టిన జల్సా స్పెషల్ షోస్..ఇది మాములు క్రేజ్ కాదు

విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజీ దృష్ట్యా లైగర్ సినిమా ఓ కిక్ బాక్సింగ్ కుర్రాడి కథగా చెబుతున్నారు. ఇందులో మైక్ టైసన్ కూడా నటించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రేక్షకుల అంచనాలకు లోబడి చిత్రాన్ని నిర్మించినట్లు చెబుతున్నారు. ఆగస్టు 25న లైగర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్యాన్ ఇండియా స్థాయిలో్ సినిమాను భారీ స్థాయిలో నిలిపేందుకు నిర్ణయించి అన్ని భాషల్లో విడుదల చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో లైగర్ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో కూడా నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

 vijay devarakonda with mike tyson
vijay devarakonda with mike tyson

Also Read: Varun Tej with the Heroine: వరుణ్ తేజ్ నాటీ.. ఆ హీరోయిన్ తో ఇలా సీక్రెట్ గా దొరికేశాడు..!

తాజాగా సినిమాకు యూ సర్టిఫికెట్ జారీ అయింది. సినిమా నిడివి కూడా రెండు గంటల ఇరవై నిమిషాలే ఉంటుందని చెబుతున్నారు. లైగర్ సినిమా ఓ పోస్టర్ ను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేయడంతో అది వైరల్ అవుతోంది. లైగర్ సినిమా ప్రేక్షకుల అంచనాలు అందుకుని భారీ హిట్ గా నిలవనుందని చెబుతున్నారు. ఈ క్రమంలో లైగర్ సినిమా నైజాం ఏరియాకే రూ. 30 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో లైగర్ సినిమా ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా భారీ హిట్ సాధించే అవకాశం ఉన్నట్లు సినీవర్గాల అభిప్రాయం. లైగర్ మూవీ ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించారు. ఇండియాలోని అన్ని భాషల్లో లైగర్ సినిమా విడుదల కానుంది. విజయ్ దేవరకొండకు మరో బ్లాక్ బస్టర్ ఖాయమనే అంచనాలు వస్తున్నాయి. అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. లైగర్ సినిమా ప్రమోషన్లలో భాగంగా బిజీగా ఉంది. ఏదో ఒక సర్ ప్రైజ్ ఇవ్వడానికి సమాయత్తం అవుతుందని చెబుతున్నారు. లైగర్ సినిమాతో అటు విజయ్ దేవరకొండ, అటు పూరీకి మరోమారు బ్లాక్ బస్టర్ హిట్ అనే టాక్ వస్తోంది. దీంతో ఇద్దరికి లైగర్ సినిమా ఓ టానిక్ గా మారనుందని సమాచారం.

liger movie team
liger movie team

లైగర్ మూవీ ఎమోజీ విడుదల చేయనుందని ప్రచారం సాగుతోంది. మూవీ ఏం సర్ ప్రైజ్ ఇస్తుందో తెలియడం లేదు. మొత్తానికి లైగర్ సినిమా బ్రహ్మాండమైన హిట్ సాధిస్తుందని అందరిలో అంచనాలు పెరుగుతున్నాయి. ఊర మాస్ డైలాగులతో విజయ్ దేవరకొండ అదరగొట్టినట్లు తెలుస్తోంది. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఏం రికార్డులు సాధిస్తుందో వేచి చూడాల్సిందే.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular