https://oktelugu.com/

Rani Poonam Pandey: అరెరే.. ఆ శృంగార తార కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కోలేదట !

Rani Poonam Pandey: బూతుల రాణి పూనమ్ పాండే గురించి ఎంత అని చెప్పాలి ? ఏమి అని చెప్పాలి ? ఆమె బోల్డ్ లోకంలో తిరుగులేని మహారాణి. అయితే, ఆ మహారాణికి గతేడాది పెళ్లి అయింది. ఆమె భర్త పేరు సామ్ బాంబే. అతగాడు ఎంత ధీరుడు అంటే.. పెళ్లి అయిన మూడో రోజే బూతుల రాణి పూనమ్ పాండేని పిచ్చకొట్టుడు కొట్టాడు. తనను దారుణంగా కొడతాడా ? అంటూ కసితో రగిలిపోయి.. పూనమ్ అతన్ని […]

Written By:
  • Shiva
  • , Updated On : January 13, 2022 / 09:28 AM IST
    Follow us on

    Rani Poonam Pandey: బూతుల రాణి పూనమ్ పాండే గురించి ఎంత అని చెప్పాలి ? ఏమి అని చెప్పాలి ? ఆమె బోల్డ్ లోకంలో తిరుగులేని మహారాణి. అయితే, ఆ మహారాణికి గతేడాది పెళ్లి అయింది. ఆమె భర్త పేరు సామ్ బాంబే. అతగాడు ఎంత ధీరుడు అంటే.. పెళ్లి అయిన మూడో రోజే బూతుల రాణి పూనమ్ పాండేని పిచ్చకొట్టుడు కొట్టాడు. తనను దారుణంగా కొడతాడా ? అంటూ కసితో రగిలిపోయి.. పూనమ్ అతన్ని పోలీసుల చేత అరెస్ట్ చేయించింది.

    Rani Poonam Pandey

    మొత్తానికి పెళ్లి అయి నాలుగు రోజులు కూడా గడవక ముందే మొత్తానికి అతని నుంచి పూనమ్ పాండే విడిపోయింది. ఇక అప్పటి నుంచి విడిగా ఉంటూ వస్తూ వస్తోంది. అయితే, పూనమ్ త్వరలోనే ఒక కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరి కొత్త సినిమా రిలీజ్ అంటే.. ప్రమోషన్స్ లో పాల్గొనాలి కదా. అందుకే, ఈ క్రమంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తెగ హడావిడి చేస్తోంది ఈ హాట్ బ్యూటీ.

    Also Read: సినిమా టికెట్ల లొల్లి ముగిసేనా? చిరంజీవికి జగన్ పిలుపు

    హడావుడి చేస్తే.. చేసింది. తనకు సంబంధించిన పలు విషయాలను పబ్లిక్ గా వెల్లడించింది. వాటిల్లో పెళ్లి గురించే హాట్ టాపిక్ అయింది. పూనమ్ తన పెళ్లి పై మాట్లాడుతూ.. ‘నా పెళ్లి, కాపురం మొత్తానికి ఒక పీడకల. అందుకే, ఆ పీడకల గురించి నేను పెద్దగా మాట్లాడ దలచుకోలేదు. ఒక్కటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పాలని నిర్ణయించుకున్నాను. నేను ఇప్పుడు చాలా.. చాలా ప్రశాంతంగా ఉన్నాను. మరోసారి పెళ్లి, ప్రేమ వంటి ఆలోచన ఎట్టిపరిస్థితుల్లో చెయ్యను.

    నిజంగానే నా మనసు ప్రస్తుతం వాటిపై లేదు’ అంటూ పూనమ్ నిరాశ పడుతూ చెప్పింది. ఇక తనకు వచ్చే అవకాశాల పై కూడా మాట్లాడింది. పూనమ్ నువ్వు శృంగారతార.. మరి నువ్వు అవకాశాల కోసం ఏమి చేస్తుంటావ్ ? అని చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు. “నేను చెప్పే ఈ మాట మీరు నమ్మరు. కానీ నిజం, నేను ఇంతవరకు కాస్టింగ్ కౌచ్ ని ఎదుర్కోలేదు. నా విషయంలో అది జరగలేదు’ అంటూ చెప్పుకొచ్చింది పూనమ్.

    మరి పూనమ్ నిజమే చెప్తోందా ? దేశంలోనే శృంగారతారగా ఒక వెలుగు వెలిగిపోతున్న పూనమ్.. ఇంతవరకు కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కోలేదు అంటే.. ఎలా నమ్మేది ? ఏమిటో పూనమ్..? ఏదేదో చెబుతుంది.

    Also Read: నేడే వైకుంఠ ఏకాదశి… ఈ ఏకాదశి విశిష్టత ఏమిటో తెలుసా?

    Tags