https://oktelugu.com/

Naveen Polishetty: రెమ్యునరేషన్ విషయంలో నో కాంప్రమైజ్ !

Naveen Polishetty: సినిమా వాళ్లకు ఆశకి అత్యాసకి తేడా తెలియదని, సక్సెస్ రాకముందు వరకూ ఇచ్చింది పుచ్చుకునే వాళ్ళు కూడా, ఒక హిట్ రాగానే రెమ్యునరేషన్ ను అమాంతం పెంచేస్తారని టాక్ ఉంది. అందుకు ఉదాహరణగా నిలిచాడు జాతిరత్నాలు హీరో నవీన్ పోలిశెట్టి. వచ్చింది ఒక హిట్, అలాగే మరో చిన్న గుర్తింపు. హీరోగారి డిమాండ్స్ మాత్రం విచ్చలవిడిగా పెరిగిపోయాయట. పాత తరంలో బిల్డప్ హీరోయిన్లు గురించి ఒక మాట అనేవాళ్ళు. కాలు తీసి బయట పెట్టాలంటే […]

Written By:
  • Shiva
  • , Updated On : January 3, 2022 / 03:28 PM IST
    Follow us on

    Naveen Polishetty: సినిమా వాళ్లకు ఆశకి అత్యాసకి తేడా తెలియదని, సక్సెస్ రాకముందు వరకూ ఇచ్చింది పుచ్చుకునే వాళ్ళు కూడా, ఒక హిట్ రాగానే రెమ్యునరేషన్ ను అమాంతం పెంచేస్తారని టాక్ ఉంది. అందుకు ఉదాహరణగా నిలిచాడు జాతిరత్నాలు హీరో నవీన్ పోలిశెట్టి. వచ్చింది ఒక హిట్, అలాగే మరో చిన్న గుర్తింపు. హీరోగారి డిమాండ్స్ మాత్రం విచ్చలవిడిగా పెరిగిపోయాయట.

    Naveen Polishetty

    పాత తరంలో బిల్డప్ హీరోయిన్లు గురించి ఒక మాట అనేవాళ్ళు. కాలు తీసి బయట పెట్టాలంటే ప్రొడక్షన్ కారు కావాలి. సెవెన్ స్టార్ హోటల్ నుంచి టిఫిన్ తీసుకురావాలి. కానీ సినిమా చేయకముందు వాళ్ళు తినేది చిన్న హోటల్స్ లోనే. కాకపోతే సినిమా షూటింగ్స్ లో మాత్రం ఎక్కడ లేని కోరికల చిట్టా విప్పుతారు.

    Also Read:  మీరు క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తున్నారా… అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే లేదంటే అప్పుల ఊబిలో కూరుకుపోతారు!
    ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి తీరు కూడా అలాగే ఉందని అంటున్నారు. అయితే, విషయం ఉన్న హీరోలు ఎంతైనా అడగొచ్చు అని, నవీన్ పోలిశెట్టి కూడా మంచి టాలెంట్ ఉన్న హీరో కాబట్టి.. రెమ్యునరేషన్ ను డిమాండ్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు అని కొందరు నవీన్ కి సపోర్ట్ చేస్తున్నా.. నిర్మాతలు మాత్రం నవీన్ పై అసంతృప్తిగానే ఉన్నారు.

    ఒక్క హిట్ కే ఏకంగా నాలుగు కోట్లు అడుగుతున్నాడని కోపంగా ఉన్నారు. జాతి రత్నాలు సినిమా కోసం నవీన్ కి ఇచ్చింది ముప్పై ఐదు లక్షలు అట. కానీ నవీన్ ప్రస్తుతం అడుగుతున్న రెమ్యునరేషన్ నాలుగు కోట్లు అని తెలుస్తోంది. నవీన్ రెమ్యునరేషన్ పై గతంలోనూ అనేక వార్తలు వచ్చాయి. మొత్తానికి తన రెమ్యూనరేషన్ వార్తలతో నవీన్ ఇలా నిత్యం వార్తల్లో నిలిస్తే అతని కెరీర్ కే నష్టం.

    ఏది ఏమైనా తన కామెడీ టైమింగ్ తో కంప్లీట్ యాక్టర్ గా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు నవీన్ పోలిశెట్టి. పైగా నవీన్ హీరోగా వచ్చిన జాతి రత్నాలు సినిమా కరోనా పాండమిక్ టైమ్ లో కూడా థియేటర్ల నుంచి దాదాపు రూ. 65 కోట్లు గ్రాస్ రాబట్టి పెద్ద హిట్ అనిపించుకుంది. అందుకే రెమ్యునరేషన్ విషయంలో కాంప్రమైజ్ కావడం లేదట.

    Also Read:  కొత్త సంవత్సరంలో అదిరిపోయే వాట్సాప్ ఫీచర్స్.. అవేమిటంటే!

    Tags