జగన్ దెబ్బతో ఉన్నతాధికారులు విలవిల!

ఏపీ సీఎం జగన్, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నెలల వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్ లో మూడు ఉన్నతమైన పదవులలో ఉన్న వ్యక్తులపై వేటు పడింది. 2019 జనవరిలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు చేస్తూ శాసనసభ తీర్మానించింది. ఆ మరుసటి నెల(ఫిబ్రవరి)లో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావును జగన్ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించడానికి రంగం సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానుల ప్రతిపాదనలో […]

Written By: Neelambaram, Updated On : March 17, 2020 4:55 pm
Follow us on

ఏపీ సీఎం జగన్, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నెలల వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్ లో మూడు ఉన్నతమైన పదవులలో ఉన్న వ్యక్తులపై వేటు పడింది. 2019 జనవరిలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు చేస్తూ శాసనసభ తీర్మానించింది. ఆ మరుసటి నెల(ఫిబ్రవరి)లో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావును జగన్ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించడానికి రంగం సిద్ధం చేసింది.

ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానుల ప్రతిపాదనలో ఏపీ శాసనమండలి అడ్డుపడటంతో దానిని రద్దు చేయడానికి బిల్లు ప్రవేశపెట్టగా..133 మంది సభ్యులు మండలి రద్దు బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. ప్రవర్తనా నియమాల ఉల్లంఘనకు సంబంధించి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్‌ చేసింది. 2020 స్థానిక ఎన్నికల ఎన్నికలను వాయిదా వేయడంతో ఎస్ఈసి రమేష్ కుమార్ పై వేటు వేసేందుకు జగన్ సర్కార్ సిద్ధమైంది.

దేశ రాజ్యాంగ వ్యవస్థలో భాగమైన శాసనమండలి, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ల పై వేటు వేయడంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఒకవర్గం ప్రజలు జగన్ నిర్ణయానికి మద్దతిస్తుంది, మరోవర్గం ప్రజలు సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి.