
ఆదివారం అర్ధరాత్రి వరకు తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. తెలంగాణలో ఇప్పటికే దాదాపు అన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. శనివారం రాత్రి సైతం భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని గోదావరి తీర ప్రాంతాలైన పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నాళాలు ఉన్నచోట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. లోతట్టు ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలను అందుబాటులో ఉంచుకోవాలని వాతావరణశాఖ తెలిపింది.
Also Read: రాజ్యసభలో రణరంగం.. వ్యవసాయ బిల్లులకు ఆమోదం