
హైదరాబాద్‌లో కరిసిన భారీ వర్షంతో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని సారూర్నగర్ తపోవన్ కాలనీలో అందరూ చూస్తుండగానే నవీన్‌కుమార్ అనే వ్యక్తి వరదనీటిలో కొట్టుకుపోయాడు. స్థానికులు రక్షించడానికి ప్రతయ్నించినప్పటికటీ ఫలితం లేకుండా పోయింది. ఇటీవల దయాల్‌నగర్ అనే కాలనీలో సుమేధ అనే బాలిక నీటిలో కొట్టుకుపోయిన ఘటన మరువకముందే తాజాగా ఈ సంఘటన జరగడం అందరినీ కలచి వేసింది. అయితే పోలీసులు, రెస్క్యూటీం అక్కడకు చేరుకొని గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.