AIADMK-BJP alliance: మూడ్ ఆఫ్ ది నేషన్.. ఇండియా టుడే నిన్న ఒక సర్వేను వెలువరించింది. తమిళనాడులో బైపోలార్ పోటీనే ఉంటుందని తెలిపింది. జూలై 1 నుంచి ఆగస్టు 14 వరకూ ఈ సర్వే చేసింది. టీవీకే విజయ్ ఆగస్టు 21న సభ పెట్టారు. దీన్ని బట్టి చూస్తే తమిళనాడులో ముక్కోణపు పోటీ ఉంటుంది. విజయ్ ను తక్కువ అంచనా వేయడం సర్వే చేస్తున్న పెద్ద తప్పుగా చెప్పొచ్చు. విజయ్ ఓటు కట్టర్ అవుతాడా? ఓటు గెట్టర్ అవుతాడా? అన్నది ఇప్పుడే చెప్పలేం.. గ్రౌండ్ లెవల్ లోకి విజయ్ ఇంకా వెళ్లలేదు.
తమిళనాడులో ఆరునెలలు ఉంది. ఇంతవరకూ విజయ్ క్షేత్రస్థాయిలోకి రాలేదు. తెరవెనుక కాంగ్రెస్, టీవీకే విజయ్ మధ్య మంతనాలు జరుగుతున్నాయి. ఇంపార్టెంట్ ఏంటంటే.. క్రిస్టియన్ ఓటు తమిళనాడులో 20 శాతం ఉంది. క్రిస్టియన్ ఓటర్లు విస్తృతంగా తమిళనాడులో ఉన్నారు. విజయ్ వైపు ఈ ఓట్లు ర్యాలీ అవుతున్నట్టు సమాచారం.
క్రిస్టియన్ లాబీలోని వారు కాంగ్రెస్, విజయ్ కలువాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. తమిళనాడులో మోనార్క్ అయినా స్టాలిన్ బీహార్ వెళ్లి రాహుల్ ను ప్రసన్నం చేసుకునేందుకే వెళ్లడం వెనుక విజయ్ భయం ఉంది.
అన్నామలై ఫార్ములాకి భిన్నంగా అన్నాడీఎంకే తోటి బీజేపీ కూటమి ఎందుకు కట్టింది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.