https://oktelugu.com/

Jagan: తల్లికి వ్యతిరేకంగా సాక్షి మీడియాలో వార్తలు జగన్ పనేనా?

జగన్ తన క్యాడర్ తో తన సాక్షి మీడియాలో ప్రచారం చేస్తున్నారో వీటన్నింటికీ కూడా తన తల్లి విజయమ్మ లేఖతో ఫుల్ స్టాప్ పడింది. విజయమ్మ లేఖతో అందరూ కంగుతిన్నారు. అందరికంటే ముందు జగనే కంగుతిన్నారు. మీడియా ముందు షర్మిల ఏమైతే మాట్లాడిందో వాటన్నింటిని కూడా విజయమ్మ తన లేఖలో ఎండార్స్ చేశారు

Written By:
  • Neelambaram
  • , Updated On : October 30, 2024 9:46 pm

    Jagan : జగన్, షర్మిల వివాదం చినికి చినికి గాలి వానలా మారింది. ఇన్ని రోజులు జగన్ ఎకో సిస్టమ్ షర్మిలను టార్గెట్ చేసి క్యారెక్టస్ అసాసినేట్ చేసి చంద్రబాబుతో లింక్ చేసి మాట్లాడడం జరిగింది. ఇందుకోసం వైవీ సుబ్బారెడ్డి, విజయ్ సాయి రెడ్డిలను జగన్ రంగంలోకి దించాడు. వాళ్లంటే ఏమో గానీ కొమ్మినేని శ్రీనివాస్ లాంటి వాళ్లు కూడా మాట్లాడుతున్నారు. ఇదంతా సోషల్ మీడియాలో కాకుండా జగన్ సొంత మీడియా సాక్షిలో జరుగుతున్న ప్రచారం. సోషల్ మీడియాలో ప్రచారం జరిగే దానిపై నాకేం సంబంధం లేదని అనొచ్చు కానీ.. తన సొంత మీడియాలోనే ఈ విధంగా ప్రచారం జరుగుతుంది.

    ఇన్ని రోజులుగా జగన్ తన క్యాడర్ తో తన సాక్షి మీడియాలో ప్రచారం చేస్తున్నారో వీటన్నింటికీ కూడా తన తల్లి విజయమ్మ లేఖతో ఫుల్ స్టాప్ పడింది. విజయమ్మ లేఖతో అందరూ కంగుతిన్నారు. అందరికంటే ముందు జగనే కంగుతిన్నారు. మీడియా ముందు షర్మిల ఏమైతే మాట్లాడిందో వాటన్నింటిని కూడా విజయమ్మ తన లేఖలో ఎండార్స్ చేశారు. వారి ఆస్తుల్లో సమాన వాటా ఉండాల్సిందేనని స్పష్టంగా చెప్పారు. ఇది తన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిప్రాయమని పేర్కొన్నారు. అప్పట్లో జగన్, షర్మిల పేర్ల మీద కొన్ని ఆస్తులు పెట్టారు. వాటి ఆధారంగా ఆస్తుల పంపకం కాదని విజయమ్మ పేర్కొన్నారు.

    వైఎస్ ఆర్ హయాంలో ఆస్తుల పంపకం జరుగలేదు. ఇలా అన్నింటి గురించి విజయమ్మ చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ 200కోట్లను దయతలిచి ఇవ్వలేదని చెప్పారు. షర్మిల వాటా కింద వచ్చనవే ఆ ఆస్తులను పేర్కొన్నారు. చెల్లెలిని జాగ్రత్తగా చూసుకుంటానని వైఎస్ ఆర్ కు జగన్ ఇచ్చిన వాగ్ధానం గురించి కూడా లేఖలో విజయమ్మ చెప్పుకొచ్చారు. ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులు జగన్ ఆస్తులు కాదని స్పష్టం చేసింది విజయమ్మ.. తల్లికి వ్యతిరేకంగా సాక్షి మీడియాలో వార్తలు జగన్ పనేనా? దీని మీద ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

    తల్లికి వ్యతిరేకంగా సాక్షి మీడియాలో వార్తలు జగన్ పనేనా?|Vijayamma Open Letter On  Properties dispute