UP Muslims politics : మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలు.. అదొక ట్రెండ్ సెట్టర్ గా మారింది. ముస్లింల ఆలోచనల్లో మార్పు వచ్చింది. కాంగ్రెస్ ను వీడి మహారాష్ట్రలో మజ్లిస్ వైపు ముస్లింలు వెళ్లారు. శంభాజీ నగర్, మాలేగావ్ సహా కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కు పరిమితం కాగా.. ఎంఐఎంకు భారీ సీట్లు వచ్చాయి..
ఇప్పుడు యూపీకి కూడా ఇది పాకిందా? అని అనిపిస్తోంది. నాలుగు రోజుల క్రితం.. నసీముద్దీన్ సిద్ధికీ ఒకనాడు బీఎస్పీ మాయవతి ప్రభుత్వంలో మంత్రిగా చేశాడు. లెజిస్లేచివ్ అపోజిషన్ కమిటీకి లీడర్ గా చేశాడు. ఆల్ మోస్ట్ మాయవతికి కుడిభుజంగా ఉన్నాడు. 2017లో మాయవతి ఈయనను పార్టీ నుంచి బయటకు పంపింది. 2018లో కాంగ్రెస్ లో చేరాడు. 8 ఏళ్లుగా కాంగ్రెస్ లోనే ఉన్నాడు. ఈయన నాలుగు రోజుల క్రితం కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. 72 మంది ఒక పవర్ ఫుల్ ముస్లిం లీడర్స్ రాజీనామా చేసి సంచలనం రేపారు. 24 మంది వరకూ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఉండడం విశేషం.
సంవత్సరం నుంచి రాహుల్ గాంధీని కలిసి యూపీ కాంగ్రెస్ పరిస్థితిపై కలవాలనుకుంటున్నా ఈయనను కలవకుండా రాహుల్ స్కిప్ చేశాడు. దీంతో సిద్ధికీ మనస్థాపంతో కాంగ్రెస్ ను వీడారు. వీరంతా కాన్సీరాం సమాజ్ వాదీ పార్టీలోకి వెళతాడని టాక్ నడుస్తోంది. ఈయన గ్రౌండ్ లెవల్ ముస్లిం లీడర్ కావడంతో ఎస్పీ, బీఎస్పీలు ఈయనను చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.
మహారాష్ట్ర దారిలో నే కాంగ్రెస్ గుడ్ బై చెపుతున్న యుపి ముస్లింలు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.