https://oktelugu.com/

Waqf Act: అన్ని రాష్ట్రాల్లో విచ్చలవిడిగా వక్ఫ్ చట్ట దుర్వినియోగం

వక్ఫ్ చట్టాన్ని ఒక వేళ ఇది సవరణ ఏమైనా ఆమోదం పొందుతుందేమోనని ముందస్తుగానే నోటీసులు ఇస్తున్నాయి వక్ఫ్ బోర్డులు. కర్ణాటకలో 1500ఎకరాలు రైతుల భూములు మావి అని నోటీసులు ఇచ్చారు.

Written By:
  • Neelambaram
  • , Updated On : October 30, 2024 / 11:58 AM IST

    Ram Talk : వక్ఫ్ బిల్లు ఆగస్టులో పార్లమెంట్లో ప్రవేశ పెట్టి జేపీసీకి రిఫర్ చేశారు. జేపీసీలో రచ్చ రచ్చ అయింది. చివరికి ఓ పార్లమెంట్ సభ్యుడు గ్లాస్ పగలగొట్టి చైర్మన్ మీదకు విసిరారు. దీంతో ఒక రోజు సస్పెండ్ అయ్యారు. ప్రతి రోజు రచ్చ రచ్చ జరుగుతుంది. ఎందుకంటే ప్రతిపక్షాలు మెరిట్ కంటే కూడా మేము లాయల్ గా ఉన్నాం మీకు కమ్యూనిటీ అని చెప్పుకొనేందుకు తాపత్రయపడుతున్నారు. ఇదంతటికీ కారణం ఓటు బ్యాంక్ రాజకీయాలు. టీవీల్లో, జనాల్లో దీని మీద రోజు చర్చ జరుగుతూనే ఉంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఆ నాటి ప్రభుత్వాలు చేసిన దురాగతాలు.

    వక్ఫ్ చట్టాన్ని ఒక వేళ ఇది సవరణ ఏమైనా ఆమోదం పొందుతుందేమోనని ముందస్తుగానే నోటీసులు ఇస్తున్నాయి వక్ఫ్ బోర్డులు. కర్ణాటకలో 1500ఎకరాలు రైతుల భూములు మావి అని నోటీసులు ఇచ్చారు. నేడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇది పెద్ద ఇష్యూ అయింది. మహారాష్ట్ర ఎన్నికల్లో దెబ్బతగులుతుందని మానుకుంది ప్రభుత్వం. తెలంగాణలో 600ఎకరాల వక్ఫ్ ఆస్తులను మల్కాజ్ గిరిలో గుర్తించారు. తమిళనాడులోని తిరుచెందురై గ్రామంలో ఉన్న 1500 ఏళ్ల క్రితం నాటి పురాతన సుందరేశ్వర ఆలయానికి సంబంధించిన భూమిని వక్ఫ్ ఆస్తి అని డిక్లేర్ చేశారు.

    ఇటీవల లక్నోలో శివాలయం వక్ఫ్ ఆస్తులను డిక్లేర్ చేశారు. మహారాష్ట్రలోని కనిఫ్నాథ్ దేవాలయానికి సంబంధించిన 40ఎకరాల భూమి వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించారు. ఇలా చాలా దురాగతాలున్నాయి. 2013లో యూపీఐ ప్రభుత్వం దిగపోవడానికి అంటే ఎన్నికల కోడ్ అమలయ్యే ఒక రోజు ముందు 123 ఆస్తులను వక్ఫ్ బోర్డు ఆస్తులుగా పరిగణిస్తూ బదిలీ చేసింది యూపీఐ ప్రభుత్వం. అసలు ఎందుకిలా జరుగుతుంది.. అన్ని రాష్ట్రాల్లో విచ్చలవిడిగా వక్ఫ్ చట్ట దుర్వినియోగం దీని మీద ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.