Uttar Pradesh GDP : యూపీ అత్యంత వెనుకబడిన రాష్ట్రం.. పర్ క్యాపిటల్ ఇన్ కంలో దేశంలోనే కింది నుంచి రెండోది. బీహార్ దేశంలోనే అత్యంత వెనుకబడిన రాష్ట్రం.. దాని తర్వాత పేద రాష్ట్రం యూపీనే. అంతటి వెనుకబడిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ కు 2017లో యోగి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ పాలనపరమైన కఠిన నిర్ణయాలతో పాలనను గాడిలో పెట్టారు. ఆర్థిక ప్రగతికి దోహదపడే నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఒకటి యూపీని ఆధ్యాత్మిక పర్యాటక రాష్ట్రంగా మార్చాడు.
అన్ని రాష్ట్రాలతో పోలిస్తే.. పారిశ్రామికంగా , ఐటీ, సేవా రంగాల్లో యూపీ వెనుకబడింది. పారిశ్రామికంగా మొదలుపెట్టినా దశాబ్ధాలు పడుతుంది. యూపీలో బిగ్గెస్ట్ ఆస్తి ఏంటంటే.. ఆధ్యాత్మిక వారసత్వం యూపీకి తరగని సంపదగా ఉంది. అన్ని రాష్ట్రాలకంటే ఎక్కువ ఆధ్యాత్మికత కలిగినది యూపీనే. రాముడు, శ్రీకృష్ణుడు జన్మించిన స్థలం. వేల సంవత్సరాల నాటి ‘కాశీ’ ఉన్నట్టువంటి రాష్ట్రం. వేల ఏళ్లుగా భారతీయులు 12 ఏళ్లకోసారి కుంభమేళ జరిగే స్థలం కూడా యూపీనే.. ఎంతోమంది దేవతలున్న నౌమశారణ్యం ఉన్న ప్రాంతం యూపీనే..
హిందూ భక్తులకు అత్యంత పవిత్రమైన ప్రాంతం ఉత్తరప్రదేశ్. ఇక్కడ అనేకం ఉన్నాయి.. ఇదే యూపీకి ఆస్తి. బౌద్దంలో చూస్తే.. గౌతమ బుద్దుడు బౌద్దాన్ని ఆవిష్కరించింది సారనాథ్. అది యూపీలోనే ఉంది. బుద్దుడు గడిపిన శ్రవస్తి..జైనులకు ముఖ్యమైన తీర్థాంకుల్లో అయోధ్య, వారణాసిల్లో జన్మించారు. బుందేల్ ఖండ్, హస్తినాపూర్ లోనూ జైన దేవాలయాలు ఉన్నాయి..
పర్యాటక రంగాన్ని ఉద్యోగ ఉపాధి కల్పన రంగంగా మార్చిన యోగి చేస్తున్న అభివృద్ధిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
