Trump : ట్రంప్ ప్రమాణస్వీకారం చేసి ఒక నెల అవుతోంది. కానీ ప్రపంచ రాజకీయాలు ఎంతో త్వరగా మార్పు చెందుతున్నాయి. తన నిర్ణయాలు రాడికల్ గా.. ఫాస్ట్ గా ఉంటున్నాయి. అమెరికా అంతర్గతంగా ఏం జరుగుతుందన్నది పక్కనపెడితే.. ట్రంప్ వల్ల ప్రపంచ పరిణామాలు ఎలా మారుతున్నాయని చూస్తే..
ఐక్యరాజ్యసమితి రష్యా దురాక్రమణదారు అని యూరప్ దేశాలు పెట్టిన తీర్మానానికి అమెరికా వ్యతిరేకంగా ఓటు వేసింది. భారత్ ఏమో గైర్హాజరైంది. అమెరికా వ్యతిరేకంగా ఓటు వేసింది. అంత ఫాస్ట్ గా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ట్రంప్ ఉద్దేశం ఇందులో ఏంటంటే.. ఒక దేశం దురాక్రమణదారుగా ముద్ర వేస్తే ఆ దేశం ఎందుకు సహకరిస్తుంది.. రష్యా-ఉక్రెయిన్ ను యుద్ధం నుంచి తప్పించి శాంతి ఒప్పందం చేయించాలని ట్రంప్ భావిస్తున్నాడు. అందుకే ఈ వ్యతిరేకంగా ఓటు వేసినట్టు ఉన్నాడు.
ట్రంప్ రాకతో చకచకా మారుతున్న ప్రపంచ రాజకీయాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.