Kashmir Elections : కాశ్మీర్ లోయలో బీజేపీ ఎందుకు పోటీ చేయటంలేదు?

కశ్మీర్ లోయలో బీజేపీ పోటీ చేయడం లేదు. ఎందుకు పోటీచేయడం లేదన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : April 26, 2024 6:02 pm

Kashmir Elections : కశ్మీర్ లోయలో ఎన్నికలు జరుగబోతున్నాయి. జమ్మూ పార్లమెంట్ కు ఇప్పుడు ఎన్నికలు జరిగాయి. ఇప్పటికే ఉద్దంపూర్ పూర్తయ్యింది. జమ్మూ ప్రాంతంలో ప్రశాంతంగా ఎన్నికలు పూర్తయ్యాయి. కశ్మీర్ లోయలో ఎన్నికలు ఎలా జరుగుతాయన్నది ఉత్కంఠ రేపుతోంది. ప్రపంచమంతా ఎదురుచూస్తోంది.

కశ్మీర్ లో ఎన్నికలు జరుగకుండా ఉగ్రవాదులను పాకిస్తాన్ ఎగదోస్తోంది. కొంతమందిని కాల్చి చంపేసింది. ఎన్నికల ప్రక్రియలో ప్రజలు పాల్గొనకుండా చేయాలని పాకిస్తాన్ పన్నాగం..కశ్మీర్ లోయ లో మూడు ఎన్నికలు ఉన్నాయి. 7వ తేదీన అనంతనాగ్-రాజోలి ఎన్నిక జరుగబోతోంది. ఇది దక్షిణ కశ్మీర్. ఉగ్రవాదం బాగా ఉన్న ప్రాంతం. పూంచ్ రాజౌళి సైతం ఉగ్రవాదులకు అడ్డాగా ఉంది. పీర్ పంజాల్ పర్వత శ్రేణులకు అటూ ఇటూ ఉన్న ప్రాంతాల్లో మే 7న ఎన్నికలు జరుగబోతున్నాయి.

మే 13న శ్రీనగర్ లో ఎన్నికలు జరుగబోతున్నాయి. 20వ తేదీన బారాముల్లాలో ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇది కశ్మీర్ లోయ ఎన్నికల ముఖచిత్రం.

కశ్మీర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత మొట్టమొదటి ఎన్నిక. రెండోది గత చరిత్ర ఏమాత్రం బాగాలేదు. కశ్మీర్ లోయలో బీజేపీ పోటీ చేయడం లేదు. ఎందుకు పోటీచేయడం లేదన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.