Palestine: పాలస్తీనా.. ఎప్పుడూ రగులుతూనే ఉంటుంది.. ఎన్నో ఏళ్ల నుంచి ఈ సమస్య ఉంది. ఎందుకు ఇప్పుడు ఈ సమస్య బయటకొచ్చిందంటే.. ఇజ్రాయిల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ చోటు చేసుకుంది. ట్రంప్ కొత్త పథకాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అటు జోర్డన్ కు, ఇటు ఈజీప్ట్ కు ఒక అప్పీల్ చేశాడు. పాలస్తీనాలోని గాజాలో ఉన్న శరణార్థులను ఈ రెండు దేశాలు తీసుకోండి అని పిలుపునిచ్చాడు. కానీ సోదర అరబ్ దేశాలు ఏవీ కూడా పాలస్తీనీయులను తీసుకోవడానికి ఇష్టపడడం లేదు.
సిరియా అంతర్యుద్ధంలో శరణార్థులను తీసుకోవడానికి ఏ అరబ్ దేశం ముందుకు రాలేదు. వీరందరూ టర్కీ దాటి యూరప్ దేశాలకు వలస వెళ్లారు.
గాజా లోని పాలస్తీనీయులు ప్రస్తుతం జోర్డన్ లో 24 లక్షల మంది.. గాజాలో 15.80 లక్షలు, వెస్ట్ బ్యాంక్ 9 లక్షలు, లెబనాన్ లో 4 లక్షలు, సిరియాలో 4 లక్షలు , ఈజిప్ట్ లో 1 లక్ష, సౌదీలో లక్ష మంది, యూఏఈలో 25వేల మంది వరకూ ఉన్నారు.
పాలస్తీనీయులకు సోదర అరబ్ దేశాలు ఒక్క రూపాయి ఇవ్వడం లేదు. ఐక్యరాజ్య సమితినే వీరికి నిధులు సమకూరుస్తోంది. ప్రపంచదేశాల సొమ్మును ఇటు ఇస్తోంది.
పాలస్తీనా శరణార్థుల్ని పొరుగు అరబ్ దేశాలు ఎందుకు వద్దంటున్నాయి? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.