Rahul Gandhi : ఈరోజు జమ్మూ కశ్మీర్ ఎన్నికల పర్వం ముగిసింది. ఫలితాల కోసం ఎదురుచూడాలి. ప్రపంచ మొత్తంగా కశ్మీర్ ఎన్నికలు ప్రశాంతంగా.. నిక్కచ్చిగా .. పారదర్శకంగా జరిగాయని చాటి చెప్పాం.
ఉగ్రవాదులు ఎంత రెచ్చగొట్టినా.. నక్కి దాడులు చేసినా కూడా చాలెంజ్ గా తీసుకొని కేంద్రప్రభుత్వం ఎన్నికలు జరిపింది. బీజేపీకి అత్యంత కీలకమైన ఎన్నికలు ఈరోజు జరిగాయి. బీజేపీకి పట్టున్న 24 అసెంబ్లీ స్థానాల్లో గెలవాలని చూస్తున్నారు. నార్తర్న్ కశ్మీర్ లో ఈరోజు బీజేపీ గెలవవచ్చని అంటున్నారు.
ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా.. గాంధీ కుటుంబం కశ్మీర్ లో ఎన్నికలు, అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారని తేలింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు బయటి వారు వచ్చి మిమ్మల్ని దోచుకుంటున్నారని కశ్మీర్ లో ప్రచారం చేయడం అత్యంత దారుణం అని చెప్పొచ్చు. గుజరాతీలు దోచుకుంటున్నారని ఆరోపించడం పై విమర్శలు చెలరేగుతున్నాయి.
ఎన్నికల్లో గెలవటం కోసం దేశాన్ని ఫణంగా పెడుతున్న రాహుల్ గాంధీ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.