Varun Gandhi : మోడీని, యోగీని విమర్శిస్తూ టికెట్ ఆశించి భంగపడ్డ వరుణ్ గాంధీ

వరుణ్ గాంధీ కి టికెట్ ఎందుకు రాలేదన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : March 27, 2024 6:19 pm

Varun Gandhi : వరుణ్ గాంధీ.. చేజేతులారా తన గొయ్యి తానే తవ్వుకున్నాడు. బీజేపీలో సహజ నిబంధనలకు వ్యతిరేకంగా వరుణ్ గాంధీ, మేనకాగాంధీలకు బీజేపీ రెండు ఎంపీ సీట్లను గతంలో ఇచ్చింది. అదీ దగ్గరదగ్గరగానే కేటాయించాడు. గతంలో రాజ్ నాథ్ సింగ్ కొడుకు పోటీచేస్తానన్నా కూడా మోడీ స్వయంగా పిలిపించి సర్ది చెప్పారు. రాజ్ నాథ్ కినుక వహించినా మోడీ వెనక్కి తగ్గలేదు. మీ తర్వాత మీ కొడుక్కి ఇస్తామని.. ఉన్నప్పుడే ఇవ్వలేమని.. కుటుంబ పాలనను ప్రోత్సహించవచ్చదని మోడీ సిద్ధాంతం పెట్టుకున్నాడు. అందుకే రాజ్ నాథ్ కొడుక్కి టికెట్ ఇవ్వలేదు

అయితే కాంగ్రెస్ కుటుంబానికి చెందిన మేనకాగాంధీ, ఆమె కుమారుడు వరుణ్ కు మాత్రం రెండు ఎంపీ టికెట్లను మోడీ గత పార్లమెంట్ ఎన్నికల్లో కేటాయించాడు. అటువంటిది ఈసారి వరుణ్ గాంధీకి టికెట్ ను బీజేపీ ఇవ్వకుండా షాక్ ఇచ్చింది.

మోడీ 2014లో కేంద్రానికి వచ్చేటప్పటికే.. వరుణ్ గాంధీని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేశారు. దాంతోపాటు పశ్చిమ బెంగాల్ కు వరుణ్ గాంధీకి ఇన్ చార్జి ఇచ్చారు. వరుణ్ వెస్ట్ బెంగాల్ కు ఇన్ చార్జి ఇచ్చినా అక్కడికి వెళ్లలేదు. అసిస్టెంట్ ఇన్ చార్జి అయిన సిద్ధార్త్ నాథ్ వెళ్లాడు. వరుణ్ గాంధీలో ఈ కుటుంబ అహంకారం బీజేపీకి నష్టం చేసింది.

ఇక ఆ తర్వాత ఏకంగా మోడీనే విమర్శించి సంచలనం రేపాడు వరుణ్ గాంధీ.. మోడీని, యోగీని విమర్శించాడు. ఇప్పుడు బీజేపీ టికెట్ ఆశించి వరుణ్ గాంధీ భంగపడ్డాడు.

వరుణ్ గాంధీ కి టికెట్ ఎందుకు రాలేదన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.