Baloch freedom : బెలూచీలు ఎప్పుడు స్వాతంత్ర్యం పొందుతారు? బెలూచీస్తాన్ ఎప్పుడు ఏర్పడుతుందని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ పోరాటాన్ని బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంతో పోల్చుతున్నారు. 1971 నాటి బంగ్లా ఆవిర్భావంతో బెలూచీస్తాన్ పోరాటాన్ని తాజాగా పోల్చుతున్నారు. అయితే బంగ్లాదేశీయుల పోరాటానికి.. బెలూచీస్తాన్ ల పోరాటానికి మధ్యనున్న పోలికలు ఏమిటి? అవరోధాలు ఏమిటి? అన్నది చర్చించుకుందాం.
బంగ్లాదేశ్ జరిపిన పోరాటం.. దాని కేరక్టర్ తో పోల్చితే.. బంగ్లాదేశ్ ది సాంస్కృతిక పోరాటం.. బెంగాలీ భాష కోసం.. బెంగాలీ సంస్కృతి కోసం పోరాడిన పోరాటం ఇదీ. బెలూచీలది అదే భాష, సంస్కృతి కోసం పోరాటం. ఇద్దరూ ఇస్లాం మతస్థులే.. ఇద్దరూ సున్నీలే. 1947 భారత్ విభజన జరిగినప్పుడు ‘బంగ్లాదేశ్’ పాకిస్తాన్ లో కలవాలని నాడు కోరుకొని చేరిపోయారు. కానీ బెలూచీలు ఎన్నడూ పాకిస్తాన్ లో కలవాలని కోరుకోలేదు. తమకు స్వాతంత్ర్యం దేశం కావాలని వారిది ముందు నుంచి బలమైన కోరిక.
1948 నుంచే బెలూచీల పోరాటం జరుగుతోంది. 1947 విభజన వేళ బెలూచీస్థాన్ స్వంతంత్ర్య సంస్థానం. జిన్నా బలవంతంగా పాకిస్తాన్ లో సైనిక చర్య జరిపి కలిపాడు. బంగ్లాదేశ్ లో ఈ పోరాటం మొదటి నుంచి జరగలేదు. 1971లో బంగ్లాదేశ్ లో అవామీ లీగ్ గెలిచినా బంగ్లాదేశీయులకు అధికారం ఇవ్వలేక ముజిబుర్ రహ్మన్ ను జైల్లో పెట్టడంతో బంగ్లాదేశ్ పోరాటం పాకిస్తాన్ పై మొదలైంది.
బెలూచీ బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటాలు ఎందుకు ఒకటి కావు? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
