Rahul Gandhi Voter Adhikar Yatra: రాహుల్ గాంధీకి యాత్రలంటే ఓ పిచ్చి.. దాన్ని ఓ జాతరలాగా చేస్తుంటాడు. ఆయన అభిరుచి ఇదీ.. ఇది ఆయనకు ఓ ఆట విడుపు ఆటలాగా కనిపిస్తోంది. ఇప్పుడు అటువంటిదే 16 రోజుల బీహార్ ఓటరు అధికార యాత్ర.. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 1 వరకూ వాహనాల్లో రాహుల్ గాంధీ 1300 కి.మీలు యాత్ర చేపట్టనున్నారు. దీని కోసం పక్కరాష్ట్రాల నుంచి దేశవ్యాప్తంగా నేతలను పట్టుకొచ్చి ర్యాలీ చేశారు. ఇదంతా పగటి వేషగాళ్ల యాత్రగా మారింది.
స్టాలిన్,పప్పు యాదవ్, రాహుల్, ప్రియాంకలు నిన్న ఒకే జీపులో ర్యాలీ తీశారు. రాహుల్ గాంధీ వేల కోట్ల నేషనల్ హెరాల్డ్ కుంభకోణంలో ఇరుక్కున్నాడు. ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఎన్నో భూకుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
తేజస్వి యాదవ్ ఫ్యామిలీ ఎప్పటి నుంచో అవినీతిలో ఉంది. స్టాలిన్ కేబినెట్ మొత్తం అవినీతిలో ఉంది. అవినీతితోపాటు వారసత్వ రాజకీయాలు ఈ అన్నీ పార్టీల్లో ఉన్నాయి. స్వయంగా రాజకీయాల్లో ఎదిగిన వారు కాదు.. వారి కుటుంబాలను అడ్డం పెట్టుకొని రాజకీయాల్లో ఎదిగిన వారే..
రాహుల్ బీహార్ యాత్ర పగటి వేషగాళ్ళ జాతర .. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.