PM Modi : వక్ఫ్ బిల్లు ఆమోదం.. దేశానికి ఎటువంటి సంకేతాన్ని ఇచ్చింది. మోడీ 3.0 ప్రభుత్వం బలమైన ప్రభుత్వమని తేల్చిచెప్పింది. కాంగ్రెస్ పదే పదే మోడీ బలహీన ప్రభుత్వం అన్న విమర్శలకు చెక్ పెట్టింది. పొత్తుల సంకీర్ణ ప్రభుత్వంలో మోడీ ధైర్యంగా నిర్ణయాలు తీసుకోలేడు. నిర్ణయాలు అమలు చేయడు అన్న ప్రశ్నలకు చెక్ పడింది. అత్యంత కఠినమైన.. వివాదాస్పదమైన చట్టాన్ని వక్ఫ్ చట్టానికి ఇదే సంకీర్ణ ప్రభుత్వం ఆమోదింప చేసి అమలు చేయబోతోంది.
విశేషం ఏంటంటే.. ఇండీ కూటమి వారే కొందరు వక్ఫ్ చట్టానికి అనుకూలంగా ఓటేశారు. కానీ ఎన్డీఏ కూటమి వారు ఎవరూ కూడా వ్యతిరేకించలేదు. మోడీ 1.0, మోడీ 2.0 లాగానే మోడీ 3.0 కూడా అదే విధమైన ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు బలమైన సంకేతం పంపింది.
వీక్ ప్రభుత్వం అనేవారు ఈ 9 నెలల్లో జరిగిన పరిణామాలను ఎందుకు లెక్కలోకి తీసుకోవడం లేదు. బీజేపీ ప్రభుత్వం వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు.. రిజర్వేషన్లు అన్నీ రద్దు చేస్తారని ప్రచారం చేసి బీజేపీని దెబ్బకొట్టి ఓట్లు దండుకున్న వారు.. ఇప్పుడు ఏం మాట్లాడడం లేదు. కానీ బీజేపీ మాత్రం బలం పూర్తిస్థాయిలో లేకున్నా కానీ బలంగా నిలబడింది. రాష్ట్రాల్లోనూ అధికారం సంపాదించింది.
వక్ఫ్ చట్టం ఆమోదంతో మోడీ 3.O ప్రభుత్వ ప్రతిష్ట పైపైకి.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..
