Pakistan : పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులను ప్రపంచానికి ఎగుమతిచేస్తుందని తెలిసినా.. ప్రపంచంలోని అగ్రరాజ్యాలు ఎందుకు మిన్నకుంటున్నాయన్నది అందరి మనసులను తొలుస్తున్న ప్రశ్న. నిజానికి పాకిస్తాన్ ను నార్త్ కొరియాలాంటి రోగ్ నేషన్ సరసన చేర్చాల్సింది. పాకిస్తాన్ ఏదో వంకతో ఈ అగ్రరాజ్యాలను మచ్చిక చేసుకుంటూ వస్తోంది.
మొదట్లో బ్రిటన్ స్ట్రాటజిక్ గా అసెట్ గా భావించింది. బ్రిటన్ నుంచి అమెరికా ఆ వారసత్వాన్ని తీసుకుంది. ఆ తర్వాత భారత్ కు వ్యతిరేకంగా చైనా వాళ్ల అవసరాల కోసం పాకిస్తాన్ ను వాడుకుంటోంది. ఇప్పుడు ఒక విధంగా అమెరికా-చైనా మధ్య పాకిస్తాన్ చెస్ గేమ్ ఆడుతోంది.
చైనాకు గ్వాదర్ పోర్టును అమెరికా ఆశచూపించింది. చైనా నుంచి పాక్ వరకూ రోడ్డును ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఇది చైనాకు ఆర్థికంగా బాగా కలిసి వచ్చే అంశం. కారిడార్ నిర్మిస్తోంది.
9/11 అమెరికా దాడుల తర్వాత అప్ఘనిస్తాన్ పై యుద్ధం కోసం పాకిస్తాన్ కు అమెరికా దగ్గరైంది. అలా అటు అమెరికా, ఇటు చైనాను వాడుకుంటూ పాకిస్తాన్ కుయుక్తులు చేస్తోంది. పాకిస్తాన్ లోని ‘అబోటాబాద్’లో ఒసామా బిన్ లాడెన్ ను దాచేసినా కూడా అమెరికా ఈ ఉగ్రవాద దేశంపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కామ్ గా ఉండడం విస్తుగొలుపుతోంది.
ఖనిజాల ఎర చూపి ప్రపంచ దేశాల్ని ప్రసన్నం చేసుకుంటున్న పాకిస్తాన్.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
