Rahul Gandhi vs Nishikant Dubey : లోక్ సభలో ‘ఎస్ఐఆర్’ మీద వాడి వేడి చర్చ జరిగింది. ఈ చర్చ ఇంకా మిగిలి ఉంది. ఈరోజు కూడా అమిత్ షా జవాబు ఉంది. కానీ ఈలోపలే చర్చ తేలిపోయింది. రాహుల్ గాంధీ ప్రసంగం.. దానికి ఘాటైన సమాధానం ‘నిశికాంత్ దూబే’ నుంచి వచ్చింది. ప్రతీ ప్రశ్నకు జవాబు ఇచ్చాడు.
ఇన్నాళ్ల నుంచి దీని మీద పబ్లిసిటీ ఇచ్చిన రాహుల్ గాంధీ బాగా ప్రిపేర్ అయ్యి మాట్లాడుతాడు అనుకున్నాం.. కానీ ఎప్పటిలాగానే ఫ్లాప్ అయ్యాడు. ఎప్పుడూ చెప్పిన పాయింట్లే చెప్పాడు. రాహుల్ ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదు. ఖాదీ థ్రెడ్, ఫ్యాబ్రిక్ అంటూ ఏదేదో చెప్పాడు. ఫ్యాబ్రిక్ దారాలు, సమాజం అంటూ టాపిక్ కు సంబంధం లేని ఉదాహరణలతో విసిగించాడు. ఈ మేధావితనం ఏంటో అర్థం కాలేదు.
సమస్య ఏంటంటే.. ఎన్నికల్లో ఓటు చోరుపై నిజాలు, ఆధారాలతో మాట్లాడాలి. అది మాట్లాడకుండా ఆర్ఎస్ఎస్ క్యాప్చర్ చేసిందని ఆరోపించారు. ఓటు చోటు ఎలా జరిగిందో నిరూపించాలి. కానీ రాహుల్ అదేదీ లోక్ సభలో నిరూపించలేకపోయాడు.
రాహుల్ గాంధీ ప్రశ్నలు నిశికాంత్ దూబే ఘాటు సమాధానాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
