Homeటాప్ స్టోరీస్AP New Districts Changes: ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల స్వరూపం మార్పు ఇప్పట్లో లేనట్లేనా?

AP New Districts Changes: ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల స్వరూపం మార్పు ఇప్పట్లో లేనట్లేనా?

AP New Districts Changes: 16వ సెన్సెస్ విడుదలైంది. అధికారికంగా గెజిట్ రిలీజ్ అయ్యింది. డిసెంబర్ 31, 2025 తర్వాత ఏ జిల్లాల సరిహద్దులు, పంచాయితీ, మండల సరిహద్దులను మార్చడానికి వీల్లేదని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కొన్ని వాగ్ధానాలు చేసింది. అంటే ఇప్పుడున్న జిల్లాల్లో కొన్ని జిల్లాలు, తాలూకాలు, మండలాలు మారుస్తామని తెలిపింది. కొత్త జిల్లాలు క్రియేట్ చేస్తామని వాగ్ధానం చేసింది. చంద్రబాబు, పవన్ లు ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ దీనికి కాలపరిమితి వచ్చింది. డిసెంబర్ 31లోపే ఏవైనా చేయాలి. లేదంటే జనవరి 1 నుంచి రెండేళ్లు వెయిట్ చేయాలి.

దీని గురించి ప్రభుత్వం ఏమనుకుంటోంది. జిల్లాల ప్రస్తుత స్వరూపం ఏంటో తెలుసుకుందాం. విభజన వేళ 13 జిల్లాలు ఉంటే ఇప్పుడు 26 జిల్లాలను చేశారు. నాటి సీఎం జగన్ విజ్ఞప్తులను ఏమాత్రం లెక్కలోకి తీసుకోకుండా.. గొడవలు లేకుండా ‘పార్లమెంట్’ నియోజకవర్గ వారీగా జిల్లాలను విభజించాడు. కోస్తా, ఉత్తరాంద్ర, రాయలసీమలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మార్చారు. ఒక్క అరకును ఎక్స్ ట్రా జిల్లాగా మార్చారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ అస్తవ్యస్త జిల్లాల విభజనను సరిచేస్తామని తెలిపారు. అరకు, పార్వతీపురం అల్లూరి సీతరామరాజు జిల్లాలను పునర్వ్యస్తీకరిస్తామని తెలిపారు. కానీ ఇక్కడ అస్తవ్యస్తంగా విభజన వల్ల ప్రజలకు అసౌకర్యం కలిగింది. రంపచోడవరం నుంచి మన్యం జిల్లా కేంద్రం చాలా దూరం. రాజమండ్రి పక్క నుంచి అక్కడికి వెళ్లడానికి వ్యయప్రయాసలు వెళ్లాల్సి వస్తోంది.

ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల స్వరూపం మార్పు ఇప్పట్లో లేనట్లేనా? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల స్వరూపం మార్పు ఇప్పట్లో లేనట్లేనా?| Is there no change in the districts of AP?

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version