India-UAE defense agreement: గల్ఫ్ ప్రాంతంలో శక్తి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, భారత్ కీలకమైన దౌత్య అడుగు వేసింది. పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ కలిసి రూపొందించాలనుకున్న “ఇస్లామిక్ నాటో” తరహా వ్యూహానికి ప్రత్యామ్నాయంగా, భారత్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో బలమైన రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఈ ఒప్పందంతో గల్ఫ్‌లో భారత్‌కు వ్యూహాత్మక పట్టు మరింత బలపడింది. ఉగ్రవాద నిరోధం, గూఢచర్య సమాచార మార్పిడి, సంయుక్త సైనిక శిక్షణ వంటి రంగాల్లో ఇరు దేశాల సహకారం పెరుగనుంది. ముఖ్యంగా సముద్ర భద్రత, వాణిజ్య మార్గాల రక్షణలో ఈ భాగస్వామ్యం కీలకంగా మారనుంది.
దీంతో పాకిస్తాన్ ప్రేరేపించిన ప్రాంతీయ రాజకీయాలకు చెక్ పడినట్టే కాక, గల్ఫ్ దేశాల్లో భారత్ విశ్వసనీయ భద్రతా భాగస్వామిగా ఎదిగింది. దీర్ఘకాలంలో ఈ ఒప్పందం భారత విదేశాంగ విధానానికి కొత్త బలం చేకూర్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇస్లామిక్ నాటో కి బదులుగా భారత్ యూఏఈ రక్షణ ఒప్పందం.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
