https://oktelugu.com/

Andhra Pradesh : పారిశ్రామిక పార్కులు ఏర్పాటు భవిష్యత్తుకు బంగారు బాట

పారిశ్రామిక పార్కులు ఏర్పాటు భవిష్యత్తుకు బంగారు బాట.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : August 29, 2024 / 08:41 PM IST

    ఆంధ్రప్రదేశ్ విభజనతో తీవ్రంగా నష్టపోయిన విషయం. అదో పెద్ద విషాదగాథ.. విభజన చేసిన పద్ధతిని అందరూ వ్యతిరేకించాలి. ఉమ్మడి రాష్ట్రంలో పెట్టుబడులు అన్నీ హైదరాబాద్ లోనే పెట్టారు. అయితే విభజించిన ఏపీకి రెవెన్యూలోటుకు ఏమాత్రం సహాయ సహకారాలు అందించలేదు. రెవెన్యూ ఆదాయ వనరులు లేని ఆంధ్ర రాష్ట్రాన్ని అనాథగా వదిలేసింది నాటి విభజించిన కాంగ్రెస్ పార్టీ. దాంట్లో పాత్రధారులు జైరాంరమేష్.

    ఆరోజు ఉమ్మడి ఏపీకి రాజ్యసభ సభ్యుడు జైరాం రమేష్. ఈయనే విభజనకు సూత్రధారి. రాష్ట్రాన్ని విభజించి సమన్యాయం జరగలేదు. అందుకే 2014లో విడిపోయిన ఏపీకి అనుభవజ్ఞుడు అయిన చంద్రబాబు అయితే బెటర్ అని ఆయనకే ఏపీ జనం ఓటేశారు.

    ఐదేళ్ల తర్వాత బాబును కాదు అని జగన్ కు ఒక్కసారి అవకాశం అనడంతో ఛాన్స్ ఇచ్చారు. ఐదేళ్లు ఇది చీకటి పాలన అనే చెప్పొచ్చు. తిరిగి ఆంధ్ర కోలుకోలేదు అని అందరూ భావించారు.

    కానీ ఇప్పుడు పరిణామాలు చూస్తుంటే.. ఆ ఐదేళ్లు నష్టాన్ని పూడ్చుకొని ఆంధ్రా రాష్ట్రం వేగంగా అడుగులు పడుతున్నాయి. దీనికి ప్రస్తుత రాజకీయ అవసరాలు కూడా కలిసి వచ్చాయి. ఇవాళ సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడడం ఆంధ్రాకు కలిసి వచ్చింది.

    దేశంలో స్థిర ప్రభుత్వం ఉంటే పెట్టుబడులు బాగా వచ్చి పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. అయితే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి ఏపీకి మేలు చేసింది. ఇక్కడ ఎన్నికల ముందర కూటమి కట్టడంలో పవన్ కళ్యాణ్ పట్టుదల ఈరోజు ఆంధ్రా ప్రభుత్వానికి ఉపయోగపడింది.

    పారిశ్రామిక పార్కులు ఏర్పాటు భవిష్యత్తుకు బంగారు బాట.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.